
ఒకవైపు ఏపీలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది, మరోవైపు సీఎం జగన్ మహిళలకు రెండు శుభవార్తలు చెప్పారు. ‘వైఎస్సార్ సున్నా వడ్డీ’ పథకాన్ని తన క్యాంపు కార్యాలయంలో లాంఛనంగా ప్రారంభించారు. జులై 8 వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు సీఎం జగన్ తెలిపారు.
“వైఎస్సార్ సున్నా వడ్డీ” పథకం ద్వారా 90,37,254 మహిళలు సభ్యులుగా ఉండే ఆయా సంఘాల ఖాతాల్లో రూ.1,400 కోట్లు జమ చేసినట్లు సీఎం జగన్ తెలిపారు. అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో సీఎం మాట్లాడుతూ… 2016 నుంచి సున్నా వడ్డీ పథకం నిలిచిపోయిందని, కరోనా వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా సున్నా వడ్డీ పథకం ప్రారంభించామని సీఎం జగన్ తెలిపారు. ప్రతి గ్రూపునకు రూ.20 వేల నుంచి రూ.40వేల వరకు మేలు జరుగుతుందన్నారు. జులై 8 వైఎస్సార్ జయంతి రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు. 27 లక్షల మంది పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తామని వెల్లడించారు ఇళ్ల పట్టాలతో పాటు ఉచితంగా ఇల్లు కూడా కట్టించి ఇస్తామన్నారు. ‘
అంతేకాకుండా దిశ చట్టానికి త్వరలోనే రాష్ట్రపతి ఆమోదం తెలుపుతారనే ఆశాభావాన్ని జగన్ వ్యక్తం చేశారు.వసతి దీవెన కింద 12 లక్షల మందికి మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నామని. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి మూడు నెలల సంబంధించి.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను నేరుగా తల్లుల అకౌంట్‌ల్లో జమ చేస్తామని సీఎం జగన్ వెల్లడించారు.