https://oktelugu.com/

7 జిల్లాల్లో జీరో కేసులు..!

రాష్ట్రంలో కారోనా వైరస్ బాధితుల సంఖ్య రెండు వేలకు చేరుకోనుంది. మార్చి 12 వ తేదీన నెల్లూరు జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు గుర్తించగా 59 రోజులకు 1,930 పాజిటివ్ కేసులను గుర్తించారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఏప్రిల్ 28వ తేదీన 82 కేసులు నమోదయ్యాయి. అనంతరం ఈ సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 9, 2020 / 03:01 PM IST
    Follow us on


    రాష్ట్రంలో కారోనా వైరస్ బాధితుల సంఖ్య రెండు వేలకు చేరుకోనుంది. మార్చి 12 వ తేదీన నెల్లూరు జిల్లాలో మొదటి పాజిటివ్ కేసు గుర్తించగా 59 రోజులకు 1,930 పాజిటివ్ కేసులను గుర్తించారు. గత ఐదు రోజులుగా రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. రాష్ట్రంలో అత్యధిక పాజిటివ్ కేసులు ఏప్రిల్ 28వ తేదీన 82 కేసులు నమోదయ్యాయి. అనంతరం ఈ సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది.

    ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!

    గడచిన 24 గంటల్లో 8,388 శాంపిళ్ల పరీక్ష 43 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 1,930, వీరిలో 887 మంది ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 44 మంది మరణించారు.

    ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 999గా ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ బులెటిన్‌లో తెలిపింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో అనంతపురంలో 3, చిత్తూరులో 11, గుంటూరులో 2, కృష్ణాలో 16, కర్నూలులో 6, విశాఖపట్నం జిల్లాలో 5 కేసులు నమోదయ్యాయి. శనివారం రాష్ట్రంలోని 7 జిల్లాలో ఒక్క కేసు నమోదు కాకపోవడం విశేషం. వీటిలో ఉభయ గోదావరి జిల్లాలు, కడప, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి.

    డిసెంబర్ చివరి వరకు వర్క్‌ ఫ్రం హోం..!

    గతపక్షం రోజులకుపైగా విశాఖలో కరోనా కేవలం 22 కేసులకు పరిమితం అవగా తాజాగా ఈ సంఖ్య 62కు చేరింది. శుక్రవారం ఒక్క రోజే 11 మందికి జిల్లాలో కరోనా సోకింది. ఇంతకాలం కేసులను వెల్లడించకుండా తొక్కిపెట్టారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.