మందు ఓపెన్.. గుడులు, పనులు బంద్ న్యాయమా?

మందు తాగితే కరోనా రాదా? మద్యంకోసం జనాలు ఎగబడితే రాదా? క్యూలో గ్యాప్ లేకుండా దగ్గరగా ఉంటే వ్యాపించదా? కేవలం ఆఫీసుల్లో పనిచేసుకుంటే..? పవిత్రమైన దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకుంటేనే కరోనా వస్తుందా? రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పనులకు అభ్యంతరం చెబుతూ వలస కూలీలను రైళ్లలో తరమిస్తున్న సర్కారు.. పనిచేసుకునే వారిని.. ఆధ్యాత్మికతతో గుడికి వెళ్లే వారిని.. మిగతా సోషల్ డిస్టేన్స్ పాటించే వారిని సర్కార్లు ఎందుకు అద్దంటోందన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న.. లాక్ డౌన్ […]

Written By: Neelambaram, Updated On : May 9, 2020 3:18 pm
Follow us on


మందు తాగితే కరోనా రాదా? మద్యంకోసం జనాలు ఎగబడితే రాదా? క్యూలో గ్యాప్ లేకుండా దగ్గరగా ఉంటే వ్యాపించదా? కేవలం ఆఫీసుల్లో పనిచేసుకుంటే..? పవిత్రమైన దేవాలయాలకు వెళ్లి పూజలు చేసుకుంటేనే కరోనా వస్తుందా? రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పనులకు అభ్యంతరం చెబుతూ వలస కూలీలను రైళ్లలో తరమిస్తున్న సర్కారు.. పనిచేసుకునే వారిని.. ఆధ్యాత్మికతతో గుడికి వెళ్లే వారిని.. మిగతా సోషల్ డిస్టేన్స్ పాటించే వారిని సర్కార్లు ఎందుకు అద్దంటోందన్నది ఇక్కడ అంతుచిక్కని ప్రశ్న..

లాక్ డౌన్ తర్వాత మరింత కట్టుదిట్టం:కేటీఆర్

* కరోనా టైంలోను తిరుమలేషుడిని వదల్లేదు..
కరోనా వ్యాపిస్తుందని తిరుమలేషుడిని దర్శించుకునే భాగ్యాన్ని భక్తులకు దూరం చేశారు. అదే టైంలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాత్రం తన బర్త్ డే సందర్భంగా తిరుమల వెంకన్నను దర్శించుకొని డిస్ట్రబ్ చేశాడు. భక్తులకో న్యాయం.. పాలకులకు ఒక న్యాయం అని నిరూపించాడు. ఆయన పోతే కరోనా రాదని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి తిరుమలేషుడే కాదు.. మన నగరాలు, పట్టణాల్లోని దేవాలయాలకు కూడా పట్టుమని 50 మంది కూడా ఈ టైంలో రోజు వెళ్లరు. దేవుడి సన్నిధికి వెళితే కాస్తంత ప్రశాంతతకు దక్కుతుంది. కానీ మందు బాబులకు మద్యం కొనుక్కోవడానికి అవకాశం కల్పించిన సర్కార్ దేవాలయాలను మాత్రం ఇంకా మూసి ఉంచడంపై ఆధ్యాత్మిక వాదుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

*వలస కార్మికులు.. పనిచేసుకునే ఉద్యోగులు ఏం పాపం చేశారు?
కరోనా-లాక్ డౌన్ తో పనిలేదని వలస కార్మికులను రైళ్లలో పంపిన సర్కార్.. అదే లాక్ డౌన్ ను కాస్త సడలించి వారి కూలీనాలీ పనులు చేసుకునే వెసులుబాటు ఇస్తే ఇలా వలస పోయేవారా? వారంతా పోవడంతో తెలంగాణలో ఇప్పుడు మొదలైన పనులకు కూలీల కొరత వెంటాడుతోంది. ఉత్పత్తి పడిపోతోంది. ధాన్యంసేకరణ, మిల్లింగ్ లో అవరోధం ఏర్పడుతోంది.

ఓ తల్లి విషాదగాధ.. కూతురు చనిపోయిన 2రోజులకే డ్యూటీ!

ఇక కూలీలే కాదు.. మార్కెట్ లో వివిధ పనులు చేసుకునే ఉద్యోగులు, చిన్నా చితక దుకాణాలు, ఇతర మార్కెటింగ్ వారు ఏం పాపారో చేశారో పాలకులే చెప్పాలి. మద్యం దుకాణాల నిల్చునే మంది కూడా ఇక్కడ ఉండరు. అయినా వారందరినీ ఇంట్లోనే కూర్చుండబెట్టి సర్కారులు చోద్యం చూస్తున్నాయి.

*కార్మిక, ఉద్యోగులను పట్టించుకోరా?
ప్రస్తుతం ఎంతో మంది ఉద్యోగులు కార్మికులు తమ ఉపాధి కోల్పోయి ఇంట్లోనే ఉంటున్నారు. జీతాలు లేక అల్లాడుతున్నారు. మార్కెటింగ్, ఫార్మా,రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగం, బ్రోకింగ్ సహా ఎంతో మంది ఖాళీగా ఉంటున్నారు. నిబంధనలతో సోషల్ డిస్టేన్స్ తో వారి పనులను తెరవనిస్తే వారు పనిచేసుకొని బతుకుతారు కదా.. మద్యం షాపుల కాడ ఉండే మంది కంటే తక్కువ మందే చాలా కార్యాలయాల్లో ఉంటారు. వారిని పనిచేసుకునేలా సర్కార్ మినహాయింపులు ఇస్తే ఎంతో మంది జీవితాలు నిలబడుతాయి.

*దుకాణాల వారు ఏం చేశారు?
ఇక రోజు వారీ దుకాణాల వారిని కూడా సర్కార్ బంద్ చేస్తోంది. వారందరినీ తెరిస్తే నిబంధనల ప్రకారం పనిచేసుకోమంటే వారికి ఉపాధి దక్కుతుంది. కానీ కేవలం మద్యం షాపులకు మాత్రమే ఓపెన్ చేసి జేబులు నింపుకుంటున్న సర్కారులు.. ఇలా ఉపాధినిచ్చే వ్యాపారాలు, ఉద్యోగాలు, ఉపాధిపై శీతకన్ను వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

*అందరికీ నిబంధనలు ఒకేలా ఉండాలి.
మద్యం షాపుల ద్వారా కరోనా వ్యాప్తి చెందకపోతే గుడులు, బడులు, ఇతర దుకాణాలు, ఉద్యోగ, ఉపాధి కల్పన ద్వారా కూడా కరోనా సోకదు. అవి తెరిచినప్పుడు ఇవి ఎందుకు తెరవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. తమ నోట్లో మట్టికొట్టవద్దని.. తమకు ఉపాధి చూపించాలని కోరుతున్నారు. మరి సర్కారులు ఈ మాట వింటాయో.. లేదో చూడాలి

-నరేశ్ ఎన్నం