https://oktelugu.com/

టీటీడీ చైర్మన్ గా వై. వి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం

తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు.రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు.పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ […]

Written By: , Updated On : August 11, 2021 / 12:44 PM IST
Follow us on

YV Subba Reddyతిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ గా శ్రీ వైవి సుబ్బారెడ్డి బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు.రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ను శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు.పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ను అభినందించారు.

ఉప ముఖ్యమంత్రి కె నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి, బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఎ. శ్రీనివాసులు, పి.రవీంద్ర రెడ్డి, ప్రసాదరాజు, దొరబాబు, ఎంపి డాక్టర్ గురుమూర్తి, తిరుపతి కార్పొరేషన్ డిప్యూటి మేయర్ భూమన అభినయ్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, జెఈవో సదా భార్గవి, సివి ఎస్వో గోపీనాథ్ జెట్టి తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.