https://oktelugu.com/

ఆయ‌న‌ భార్య‌ను విర‌గ్గొట్టాల‌నిపించిందిః సింగ‌ర్‌ సునీత‌

సునీత మొద‌టి పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. రెండో పెళ్లి గురించి తెలియని వారు మాత్రం పెద్ద‌గా ఉండ‌రు. దీనికి కార‌ణం.. ఆమె పెళ్లి సంద‌ర్భంగా జ‌రిగిన ర‌చ్చే. సునీత రెండో పెళ్లి చేసుకున్నందుకు మిగిలిన జ‌నాలు తెగ బాధ‌ప‌డిపోయారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు రెచ్చిపోయిమ‌రీ పోస్టులు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ అవేవీ ప‌ట్టించుకోలేదు సునీత‌. మ్యాంగో మూవీస్ అధినేత, బిజినెస్ మెన్‌ రామ్ వీర‌ప‌నేనితో జ‌న‌వ‌రి 9వ తేదీన […]

Written By:
  • Rocky
  • , Updated On : August 11, 2021 / 12:34 PM IST
    Follow us on

    సునీత మొద‌టి పెళ్లి ఎప్పుడు, ఎక్క‌డ‌, ఎలా జ‌రిగిందో ఎవ్వ‌రికీ పెద్ద‌గా తెలియ‌దు. కానీ.. రెండో పెళ్లి గురించి తెలియని వారు మాత్రం పెద్ద‌గా ఉండ‌రు. దీనికి కార‌ణం.. ఆమె పెళ్లి సంద‌ర్భంగా జ‌రిగిన ర‌చ్చే. సునీత రెండో పెళ్లి చేసుకున్నందుకు మిగిలిన జ‌నాలు తెగ బాధ‌ప‌డిపోయారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు రెచ్చిపోయిమ‌రీ పోస్టులు పెట్టారు. అయిన‌ప్ప‌టికీ అవేవీ ప‌ట్టించుకోలేదు సునీత‌.

    మ్యాంగో మూవీస్ అధినేత, బిజినెస్ మెన్‌ రామ్ వీర‌ప‌నేనితో జ‌న‌వ‌రి 9వ తేదీన సునీత పెళ్లి జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. హైద‌రాబాద్ న‌గ‌ర శివారులోని సీతారామ‌చంద్ర‌స్వామి ఆల‌యంలో వీరిద్ద‌రూ ఒక్క‌ట‌య్యారు. వీరు ఇష్ట‌ప‌డి, రెండు కుటుంబాల వారి అంగీకారంతో పెళ్లి చేసుకుంటే.. ఈ వ‌య‌సులో ఇదేంటీ..? అని మూతీ ముక్కు ముప్పైమూడు వంక‌ర్లు తిప్పారు. అయినా.. ఈ జంట‌ అవ‌న్నీ లైట్ తీసుకుంది. ప్ర‌స్తుతం హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తోంది.

    అయితే.. మొద‌టి భ‌ర్త నుంచి విడిపోయిన త‌ర్వాత దాదాపు ద‌శాబ్ద కాలం వ‌ర‌కు ఒంట‌రిగానే గ‌డిపింది సునీత‌. ఈ క్ర‌మంలో త‌న‌కు ఎద‌రైన చేదు అనుభ‌వాల‌ను యూట్యూబ్ చాన‌ల్ వేదిక‌గా పంచుకుంటున్నారు. ఎవ‌రెవ‌రు త‌న ప‌ట్ల ఎలా ప్ర‌వ‌ర్తించారు అనే విష‌యాల‌ను వివ‌రిస్తోంది. తాజాగా.. ఓ సంగీత ద‌ర్శ‌కుడి భార్య త‌న ప‌ట్ల ప్ర‌వ‌ర్తించిన తీరును వివ‌రించింది సునీత‌.

    ఒక పెద్ద సంగీత ద‌ర్శ‌కుడి స్టూడియోలో పాట పాడేందుకు వెళ్లింద‌ట‌. అప్పుడు ఆ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఆయ‌న చేతిలో ఉన్న మైకును సునీత‌కు ఇచ్చి పాడ‌మ‌ని చెప్పార‌ట‌. ఆమె పాట పూర్తిచేసి, మైక్ ప‌క్క‌న పెట్టి తిరిగి వ‌చ్చేట‌ప్పుడు ఆయ‌న భార్య అస‌హ్యంగా మాట్లాడింద‌ని సునీత ఆవేద‌న వ్య‌క్తం చేసింది.

    అత‌న్నుంచి మైక్ తీసుకుంటున్న‌ప్పుడు సునీత చేతివెళ్లు త‌గిలాయ‌ట‌. అదీ.. ఆమె అబ్జెక్ష‌న్‌! ‘‘మా ఆయ‌న చేతిలో మైక్ తీసుకుంటున్న‌ప్పుడు చేతి వేళ్లు తాకుతున్నావేంటీ? నీ ఉద్దేశమేంటీ? అస‌లు ఏమ‌నుకుంటున్నావ్‌?’’ అని వల్గర్ గా మాట్లాడిందట. దీంతో.. తాను తీవ్ర ఆవేదనకు గుర‌య్యాన‌ని చెప్పింది సునీత‌. అప్పుడు ఆమెకు ధీటుగానే స‌మాధానం ఇచ్చాన‌ని, కానీ.. ఇంటికి వెళ్లిన త‌ర్వాత రాత్రంతా ఏడ్చాను అని చెప్పింది. త‌న జీవితంలో చాలా సార్లు ఇలాంటి నింద‌లు ఎదుర్కొన్నాన‌ని, అలాంటి స‌మ‌యంలో.. ఇలాంటి వాళ్ల‌ను కొట్టాల‌నిపించేదని చెప్పారు సునీత‌.