
కరోనా కట్టడి కోసం దేశమంతా లాక్ డౌన్, భౌతిక దూరం పాటిస్తుంటే ముఖ్యమంత్రి దగ్గరి బంధువులైన ఆ కుటుంబం మాత్రం తమకేమీ నిబంధనలు వర్తించవన్నట్లు వ్యవహరిస్తోంది. “రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా” అన్నట్టు టీటీడీ చైర్మన్ అనుకోగానే దేవదేవుడి ఆలయంలో దర్శనం ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. సామాన్య భక్తులకు సెలవిచ్చిన ఏడుకొండల వాడు వీఐపీలను మాత్రం దూరంగా ఉంచలేకపోతున్నాడు. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పుట్టినరోజు కావడంతో సెలవులో ఉన్న తిరుమలేశుడు సైతం తప్పక దర్శనం ఇవ్వాల్సి వచ్చింది. సకుటుంబ సమేతంగా వచ్చిన జగన్ బాబాయి కనీసం భౌతిక దూరాన్ని పాటించకపోవడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి
జగన్ కొలువులో సలహాదారు.. రాజీనామా వెనుక కథేంటి?
లాక్ డౌన్ లో తిరుమల శ్రీవారి దర్శనానికి అనుమతి లేదని టీటీడీ అధికారులు ప్రకటించారు. మార్చి 22 నుంచి భక్తులను ఎలాంటి దర్శనానికి అన్యుమతించడం లేదు. లాక్ డౌన్ ముగిసేవరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. టీటీడీ పాలక మండలి ఆ ఆదేశాలను పాటించకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. స్యయంగా టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వెంకటపతి దర్శనం శనివారం చేసుకున్నారు.
కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!
టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి రెడ్ జోన్ లో ఉన్న చిత్తూరు జిల్లాలో కట్టుదిట్టమైన లాక్ డౌన్ సమయంలోను నిబంధనలు ఉల్లంఘించి కుటుంబ సభ్యులందరితో కలిసి సామాజిక దూరం పాటించకుండా స్వామి వారి దర్శనం చేసుకోవడానికి ముఖ్య కారణం ఒకటి చెబుతున్నారు. సుబ్బారెడ్డి పుట్టినరోజు కావడంతో ఆయన కుటుంబ సభ్యుల కలిసి స్వామి వారి దర్శనం చేసుకున్నారని టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. చైర్మన్ అందునా స్వయానా ఆయన పుట్టినరోజు కావడంతో టీటీడీ సిబ్బంది ఆలయ తలుపులు తెరిచి, స్వామివారికి అలంకారాలు చేసి చైర్మన్ దర్శనానికి సిద్ధం చేశారు.
ఈ వ్యవహారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ‘‘ఆపదమొక్కులవాడా! అనాథరక్షకా! నీకూ పేదా పెద్ద తేడాల్లేవంటారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న ఈ కాలంలో సామాన్యులకు నీ దర్శనభాగ్యమే లేదు. వైఎస్ తోడల్లుడు సకుటుంబ సమేతంగా వచ్చేసరికి నీ గుడి తలుపులు ఎలా తెరిచారయ్యా! దేవదేవుడు ఉత్సవాలతో అలరారిన తిరుమలగిరులు నిర్మానుష్యంగా మారినవేళ నిబంధనలు తుంగలోతొక్కి నీ సన్నిధిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం అపరాధం కాదా! ఏడుకొండలే లేవన్నోళ్లు.. నువ్వున్నావంటే నమ్ముతారా? నీ కొండను నువ్వే కాపాడుకో స్వామీ!’’ అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు.