
తెలుగు చిత్ర సీమ లో హీరోయిన్ ల హీరోయిన్ల కొరత బాగా ఉంది అందుకే ఎపుడు పరభాషా తారల మీద ఆధారపడాల్సి వస్తోంది. భారీ బడ్జట్ సినిమాలైతే బాలీవుడ్ భామలకు ఛాన్స్ ఇస్తున్నారు. మీడియం బడ్జట్ సినిమాలకు పొరుగున ఉన్న కన్నడ , మళయాళ భాషలనుంచి తారలను దిగుమతి చేసుకొంటున్నారు.. ఇపుడు తాజాగా మళయాళ చిత్ర సీమకి చెందిన “కన్ను కుట్టి” (వింక్ గర్ల్ ) ప్రియా ప్రకాష్ వారియర్ కి రెండు సినిమాల్లో మంచి ఆఫర్లు దక్కాయి. విశేషం ఏమిటంటే ప్రియా ప్రకాష్ వారియర్ నటించిన తొలి మళయాళ చిత్రం ” ఒరు ఆధార్ లవ్ ” చిత్రం ప్లాప్ అయ్యింది.
కోడెల `ఆత్మహత్య’ మిస్టరీపై టీడీపీ, వైసీపీ రాజకీయం!
అలాంటి మల్లు కుట్టి కి రెండు తెలుగు చిత్రాల్లో మంచి ఆఫర్లు వచ్చాయి . ప్రిన్స్ మహేష్ బాబు కథానాయకుడిగా గీత గోవిందం ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కొత్త చిత్రం లో ఒక కీలక పాత్రకు ప్రియా ప్రకాష్ వారియర్ సెలెక్ట్ అయినట్టు తెలిసింది. ఇక దీంతో పాటు నితిన్ హీరోగా మనమంతా ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో రూపొందుతోన్న` క్రాష్ ` చిత్రంలో కూడా రెండో హీరోయిన్ గా నటించే దక్కించుకొన్నట్టు తెలుస్తోంది .