YSRCP MP: టెక్నాలజీతో ఎన్నిరకాల సదుపాయాలు ఉన్నాయో… అంతకు మించి సమస్యలు కూడా ఉంటాయి. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ చిన్నపాటి తప్పిదమైనా మెడకు చుట్టుకుంటుంది. బజారుపాలు కాక తప్పదు. ఇప్పుడు అటువంటి సమస్యనే ఎదుర్కొంటున్నారు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్. ఓ మహిళతో నగ్నంగా వీడియో కాల్ లో మాట్లడుతున్నట్టు ఓ వీడియో నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. కనీసం మార్ఫింగ్ చేశారన్న ఆనవాళ్లు కనిపించని విధంగా వీడియో ఉందని నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. అటు ప్రధాన మీడియాలో కూడా ఇది వాస్తవానికి చాలా దగ్గరగా ఉందన్న వార్తలు వస్తున్నాయి. అక్షరాల్లో రాయలేని విధంగా ఉన్న వీడియో ఇప్పుడు సంచలనంగా మారిందంటున్నారు. ఇది ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రత్యర్థులకు ఆయుధంగా మారింది. సదరు వీడియో ఇప్పుడు నెట్టింట్లో తెగ ట్రోల్ అవుతోంది. అన్ని గ్రూపుల్లో హల్ చల్ చేస్తోంది. అయితే చాలామంది ఈ దృశ్యాలను చూడలేక తొలగిస్తున్నారు. మరికొందరైతే ఇటువంటి పోస్టింగులు పెట్టొద్దంటూ కామెంట్లు పెడుతున్నారు.

అనూహ్యంగా రాజకీయాల్లోకి..
గోరంట్ల మాధవ్ మాజీ పోలీస్ అధికారి. అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చారు. సీఐ ఉద్యోగానికి రాజీనామా చేసి 2019 లో వైసీపీ తరుపున హిందూపురం ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. రాజకీయ ప్రత్యర్థులపై దూకుడు స్వభావంతో ఉంటారన్న అపవాదు ఆయనపై ఉంది. ఇప్పుడు అదే దూకుడుతో ఇప్పడు అడ్డంగా బుక్కాయ్యారని టాక్ నడుస్తోంది. లేకపోతే బాధ్యతాయుతమైన లోక్ సభ సభ్యుడిగా ఉంటూ నగ్నంగా ఉంటూ మహిళతో మాట్లాడడమేమిటని సామాన్య ప్రజలు సైతం ప్రశ్నిస్తున్నారు. అటు సహచరులు సైతం మాధవ్ కు మద్దతుగా మాట్లాడలేకపోతున్నారు. అయితే ఎంపీ మాధవ్ మాత్రం దానిని కొట్టి పారేస్తున్నారు. అదంతా మార్ఫింగ్ చేశారని ఆరోపిస్తున్నారు. తానేనని నిరూపిస్తే ఎటువంటి శిక్షకైనా సిద్ధమేనంటున్నారు. అదంతా తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు వ్యక్తులు చేసిన కుట్రగా అభివర్ణిస్తున్నారు.
వైసీపీలో వణుకు…

మరోవైపు ఈ వీడియోను చూసిన వారంతా కనీసం ఎంపీ పై సానుభూతి చూపిన దాఖలాలు లేవు. వాస్తవానికి దగ్గరగా ఉందని.. మార్పింగ్ చేసే అవకాశమే లేదంటున్నారు.అయితే ఈ విషయంలో ఎలా వెళ్లాలో తెలియక వైసీపీ నేతలు సైతం మల్లగుల్లాలు పడుతున్నారు.రాజకీయ విమర్శలు వచ్చిన ప్రతీసారి వైసీపీ నేతలు అదే స్థాయిలో ఎదురు దాడి చేస్తుంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంపీ మాధవ్ ను సమర్థిస్తే మాత్రం నడి బజార్లో పార్టీ పరువు గంగపాలయ్యే అవకాశముందని వైసీపీ నేతలు భయపడుతున్నారు. అలా చేస్తే ప్రత్యర్థులకు అవకాశమిచ్చినట్టవుతుందని వెనక్కి తగ్గుతున్నారు. ఇప్పటికే చీకోటి ప్రవీణ్ రూపంలో ఎదురు దెబ్బ తగిలింది. ఆయన వద్ద ఏపీలో పెద్ద తలకాయలే ఉన్నట్టు ప్రచారం సాగుతోంది. విచారణలో పేరు చెబితే మూల్యం చెల్లించుకోక తప్పదని భావిస్తున్నారు. ఈ సమయంలో సాక్షాత్ ఓ ఎంపీ ఇలా చిక్కుకోవడం వైసీపీ అధిష్టానానికి తలవంపులు తెచ్చినట్టయ్యింది. ఈ వివాదం ఏపీలో పెను ప్రకంపనలకు దారితీసే అవకాశముంది.
[…] […]
[…] […]