Palle Raghunatha Reddy: డాక్టర్ యాక్టర్ కావడం… యాక్టర్ పొలిటీషియన్ కావడం తెలుగునాట సాధరణమే. వెండి తెరపై రాణించిన ఎన్డీఆర్ పార్టీ స్థాపించి అనతికాలంలోనే రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇక ఎంతో మంది డాక్టర్లు ప్రజానాడిని పట్టి నాయకులుగా ఎదిగారు. కానీ పొలిటీషియన్ యాక్టర్ కావడమనేది చాలా అరుదు. అటువంటి వారు మచ్చుకు కొందరు మాత్రమే. లేటు వయసులో నటనపై ఆసక్తితో కొంతమంది పరి తపిస్తుంటారు. అటువంటి వారు ఇప్పుడు ఏపీలో ఎక్కువగా కనిపిస్తున్నారు. బిగ్ స్క్రీన్ పై ఎంట్రీకి తహతహలాడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అధికార పార్టీలో ఉన్న కొందరు నేతలు సినిమా తెరపై మెరిశారు. ఇటీవల తాజా మాజీ ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సినిమాలో మెరిశారు. ముఖ్య పాత్రలో మెప్పించారు. ప్రస్తుతం ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే తాజాగా మరో మాజీ మంత్రి ఒకరు ఫుల్ లెంగ్త్ రోల్ చేయడానికి సిద్ధమయ్యారు. ఆయన చెబుతున్న డైలాగులు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆయన ఫవర్ పుల్ డైలాగులతో అదరగోడుతున్నారు. ఆయన డైలాగులు అచ్చం బాలయ్యను గుర్తుచేస్తున్నాయంటూ నెటిజెన్లు తెగ ఫిదా అవుతున్నారు.

సీనియర్ నేతగా..
ఇంతకీ ఆయన ఎవరనుకుంటున్నారు? తెలుగుదేశంలో కీలక మంత్రిగా, విప్ గా వ్యవహరించిన చంద్రబాబుకు అత్యంత విధేయుడు పల్లె రఘునాథరెడ్డి. ఎంతో సీనియర్ అయినా ఆయన చిన్నప్పటి నుంచి నటన మీద ధ్యాస ఉందట. అచ్చం మీరు హీరోలా ఉన్నారంటూ అనుచరులు, అభిమానులు అనేసరికి ఆయనకు నటించాలన్న కుతూహలం ఏర్పడింది. అనుకోని అవకాశం రావడంతో ఆయన సినిమాలో నటించడానికి సిద్ధమైపోయారు. ఆయన పలికిన డైలాగు ఇప్పడు వైరల్ అవుతోంది. కలెక్టర్ పాత్రలో ఆయన మెప్పించబోతున్నారు. ‘చూడు కమిషనర్…నేను టై వేసుకున్నంత వరకూ కలెక్టర్.. టై తీసేనాంటే టైగర్’ అంటూ ఆయన డైలాగులతో అదరగొడుతున్నారు. సీనియర్ నటుడిగా అవలీలగా మెప్పించగలుగుతున్నారుట.
ఎన్నో పదవులు
అనంతపురం జిల్లాలో పల్లె రఘునాథరెడ్డిది ప్రత్యేక స్థానం. సుదీర్ఘ రాజకీయ అనుభవమున్న రఘునాథరెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎమ్మెల్సీగా, మంత్రిగా, ప్రభుత్వ విప్ గా పనిచేసిన అనుభవం ఉంది. ముందుగా ఆయన విద్యాసంస్థల అధినేతగా అందిరకీ సుపరిచితుడు. అందుకే ఆయనకు రాజకీయ నాయకుడిగా కంటే విద్యావేత్తగానే పేరుంది. అందుకే ఆయనతో చనువు ఉండే వారు సైతం ఎప్పుడూ సర్ అనో.. అయ్యవారు అనే సంబోధిస్తుంటారు. ఆయనలోకలివిడి తనం ఎక్కవు. కొత్త వారితో సైతం ఇట్టే కలిసిపోతారు. నవ్వుతూ పలుకరిస్తుంటారు. రాజకీయాలకతీతంగా అందర్నీ అభిమానిస్తారుట. అనంతపురం జిల్లాకు చెందిన కూరగాయల లక్ష్మీపతి అనే నిర్మాత కాలేజీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక సినిమాను నిర్మిస్తున్నారు. అందుకు పల్లె రఘునాథరెడ్డి కాలేజీల కోసం సంప్రదించారు. ఈ క్రమంలో ఓ పాత్రకు మీరే సూటవుతారని వారు చెప్పడంతో పల్లె ఒప్పేసుకున్నారు.

విభిన్న శైలి
అటు పల్లె రఘునాథరెడ్డి శైలి భిన్నంగా ఉంటుంది. సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు దగ్గరగా ఉంటుంది. మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన పని అందరికీ నవ్వు తెప్పించింది. ఆయన ఓ సారి బహిరంగంగా షర్ట్ ఫ్యాంట్ తీసి చెరువులో ఈత కొట్టడం అప్పడు చర్చనీయాంశమైంది. ఒకసారి కూలీగా అవతారమెత్తి ఆకట్టుకున్నారు. అందుకే ఆయన ఈ సినిమాలో పాత్రకు సరిపోతారని చిత్రం యూనిట్ భావించిందని తెలుస్తోంది.
[…] Also Read:Palle Raghunatha Reddy: బిగ్ స్క్రీన్ పై ఏపీ నేతలు.. వ… […]