Next CJI Justice Lalit: భారత ప్రధాన న్యాయమూర్తి త్వరలో మారనున్నారు. ఇప్పటి వరకు ఉన్న జస్టిస్ ఎస్వీ రమణ ఈనెల 26న పదవీ విమరణ చేయనున్నారు. అయితే ఆ తరువాత ప్రధానన్యామూర్తిగా జస్టిస్ ఉదయ్ లలిత్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లలిత్ పేరును ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రమణ ప్రతిపాదించారు. గురువారం ఈ పేరును సిఫార్స్ చేస్తు కేంద్ర న్యాయశాఖకు లేఖ రాశారు. ఆ తరువాత ప్రధానమంత్రి పరిశీలన కోసం ఆ లేఖను పంపిస్తారు. అయితే అంతిమంగా రాష్ట్ర పతి ఎవరిని నియమించాలన్నది నిర్ణయం తీసుకుంటారు. ఒక వేళ రాష్ట్రపతి లలిత్ పేరును ఓకే చేస్తే 49వ సీజేగా ఉదయ్ లలిత్ ప్రధాన న్యాయమూర్తి కానున్నారు. అయితే జస్టిస్ లలిత్ ఎన్నో వివాదాస్పద కేసులపై తీర్పు వెలువరించారు. వాటిటో కొన్ని పరిశీలిస్తే.

Justice Lalit
జస్టిస్ ఉదయ్ లలిత్ 1957 నవంబర్ 9న జన్మించారు. 1983లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 1985లో ముంబయ్ హైకోర్టులో ప్రాక్టిస్ చేసిన తరువాత 1986 జనవరి నుంచి సుప్రీం కోర్టుకు మారారు. 2014 ఆగస్టు 13న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఒకవేళ రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసి లలిత్ చీఫ్ సీజే అయితే బార్ నుంచి నేరుగా సుప్రీం కోర్టు బెంచ్ కి ఎలివేషన్ పొందిన రెండో సీజేఐ అవుతారు. అంతకుముందు 1971 జనవరిలో 13వ సీజేఐ నియమితులైన ఎస్ ఎం సిక్రీ ఈ కోవకే చెందినవారు.
Also Read: YSRCP MP: మహిళతో నగ్నంగా దొరికిన వైసీపీ ఎంపీ.. వైరల్ వీడియో..
జస్టిస్ ఉదయ్ అనేక కీలక కేసుల్లో తీర్పునిచ్చారు. 2017లో 3-2 మెజారిటీతో తక్షణ ‘ట్రిపుల్ తలాక్’ ద్వారా విడాకుల పద్ధతి రాజ్యంగ విరుద్ధం అని తీర్పునిచ్చారు. అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్, జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ తీర్పును ఆరునెలల పాటు నిలిపివేశారు. ఆ మేరకు చట్టం తీసుకు రావాలని ప్రభుత్వాన్ని కోరగా.. జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, యూయూ లలిత్ లు తమ వాదనను వినిపించారు.

Justice Lalit
కేరళలోని ప్రముఖ పద్మనాభస్వామి ఆలయంలో ట్రావెన్ కోర్ రాజకుటుంబానికి నిర్వహణ హక్కు కలిగి ఉందని జస్టిస్ లలిత్ నేతృత్వంలో ధర్మాసనం తీర్పునిచ్చింది. గత పాలకుడు శ్రీ చితిర తిరునాళ్ బలరామ వర్మ తమ్ముడు ఉద్రాతం తిరునాళ్ ముర్తాండ వర్మ చట్టపరమైన వారసుల అప్పీల్ ను ఆ ధర్మాసనం అనుమతించింది. ఫలితంగా కేరళ హైకోర్టు 2011లో ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
పిల్లల శరీరంలోని లైంగిక భాగాలను తాకడం లేదా.. లైంగిక ఉద్దేశంతో శారీరకంగా వేధించినా.. దానిని ‘లైంగిక చర్య’గానే పరిగణించబడుతుందని జస్టిస్ యుయు లలిత్ నేతృత్వంలో తీర్పునిచ్చింది. ఇక పోక్సో చట్టం కింద రెండు కేసుల్లో బాంబే హైకోర్టు ఇచ్చిన వివాదాస్పద ‘స్కిన్ టు స్కిన్’ తీర్పులను బెంచ్ కొట్టివేసింది.
Also Read: Telangana BJP: నాలుగో ఆర్ కోసం కమలం తాపత్రయం