వైసీపీ ఎమ్మెల్యేకు కరోనా?

రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణాలో ఎమ్మెల్యేలు కొద్ది మందితో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు వైరస్ భారిన పడ్డారు. విజయనగరం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వన్డే భారత్ మిషన్ కార్యక్రమంలో కేంద్రం ఏర్పాటు చేసిన విమానంలో విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ట్రూనాట్ మెషిన్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని […]

Written By: Neelambaram, Updated On : June 23, 2020 9:56 am
Follow us on


రాష్ట్రంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే కరోనా వైరస్ భారిన పడిన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణాలో ఎమ్మెల్యేలు కొద్ది మందితో పాటు ప్రతిపక్ష పార్టీ నాయకులు, సినీ ప్రముఖులు వైరస్ భారిన పడ్డారు. విజయనగరం జిల్లాలోని అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సొంత పనుల నిమిత్తం అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వన్డే భారత్ మిషన్ కార్యక్రమంలో కేంద్రం ఏర్పాటు చేసిన విమానంలో విశాఖకు చేరుకున్నారు. ఆయనకు ట్రూనాట్ మెషిన్ పరీక్ష చేస్తే పాజిటివ్ అని తేలింది. దీంతో స్వాబ్ సేకరించి ఆర్టీపీసీఆర్ టెస్టు కోసం పంపారు. జిల్లా కలెక్టర్ హరిజవాహర్ లాల్ మాట్లాడుతూ పరీక్షా ఫలితాల కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు.

గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తికి కారకులుగా వైసీపీ ఎమ్మెల్యేలు మారారని టిడిపి, ఇతర ప్రతిపక్షాలు విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే వైరస్ భారిన పడటం మరింత ఇబ్బంది కలిగించే విషయం. మరోవైపు రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఎక్కడికక్కడ లాక్ డౌన్ ను జిల్లా కలెక్టర్ లు విధిస్తున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో లాక్ డౌన్ కొనసాగుతుంది. కేసుల నమోదును బట్టీ స్థానికంగా లాక్ డౌన్ ను కలెక్టర్ స్థానిక పరిస్థితుల ఆధారంగా విధిస్తున్నారు.

అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

కోవిడ్‌ నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన క్షేత్రస్థాయి వ్యూహాన్ని అమలు చేయనుంది. వచ్చే 90 రోజుల్లో రాష్ట్రంలోని ప్రతి కుటుంబాన్ని పూర్తిస్థాయిలో స్క్రీనింగ్‌ చేయాలని, పరీక్షలు నిర్వహించాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికారులను ఆదేశించారు. దీని కోసం 104 వాహనాలను వినియోగించు కోవాలని, అనుమానం ఉన్న వారి నుంచి కోవిడ్‌ శాంపిల్‌ తీసుకునే సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులను గుర్తించడానికి పరీక్షలు నిర్వహించి, వారికి అక్కడే మందులు ఇవ్వనున్నారు. దీనికి అనుగుణంగా 104లో సదుపాయాలను కల్పించేందుకు వైద్య ఆరోగ్యశాఖ చర్యలు చేపట్టింది. ప్రతి నెలలో కనీసం ఒకసారి గ్రామంలో 104 ద్వారా వైద్యసేవలు, స్క్రీనింగ్‌ చేయనున్నారు. స్క్రీనింగ్, పరీక్షలు చేసిన తర్వాత వివరాలను క్యూఆర్‌ కోడ్‌ ఉన్న ఆరోగ్య కార్డులో పొందుపరచనున్నారు. పట్టణాలకు సంబంధించి కూడా ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేయాలని చేసేందుకు సిద్ధమవుతున్నారు.