https://oktelugu.com/

మండలిపై టీడీపీ ప్రయత్నాలు ఫలిస్తాయా?

శాసన మండలిలో బలం ఉన్న టీడీపీ మండలి రద్దు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో బలం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతుంది. శాసన మండలిలో మాత్రం ప్రస్తుతం తనమాటే నెగ్గించు కుంటుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు. గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..! అదేవిధంగా శాసన మండలిలో గతంలో చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపిన […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 23, 2020 / 10:22 AM IST
    Follow us on


    శాసన మండలిలో బలం ఉన్న టీడీపీ మండలి రద్దు చేయకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తోంది. అసెంబ్లీలో బలం లేకపోవడంతో టీడీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కోలేకపోతుంది. శాసన మండలిలో మాత్రం ప్రస్తుతం తనమాటే నెగ్గించు కుంటుంది. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడానికి వ్యతిరేకంగా టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ వేశారు.

    గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

    అదేవిధంగా శాసన మండలిలో గతంలో చర్చించి సెలెక్ట్ కమిటీకి పంపిన బిల్లుల విషయం తెలకుండానే, మరోమారు పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను మరోసారి శాసన మండలికి పంపడంపైన మరో పోటీషన్ దాఖలు చేశారు. శాసన సభ తీర్మానం ఎమ్మెల్సీల హక్కులను కాలరాసేదిగా ఉందని, పార్లమెంట్ కు విజ్ఞప్తి చేస్తూ శాసన సభ చేసిన తీర్మానాన్ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు.

    శాసన మండలి రద్దు కోరుతూ శాసన సభ శీతాకాలం సమావేశాల్లో తీర్మానం చేసిన విషయం విదితమే. అనంతరం కరోనా ప్రభావంతో పార్లమెంట్ సమావేశాలు జరగక పోవడం, గత సమావేశాల్లో సభ ముందుకు ఈ అంశం రాకపోవడంతో మండలి రద్దుకు కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో టీడీపీ ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించింది. టీడీపీకి మండలిలో బలం ఉండటంతో ప్రభుత్వాన్ని ఎదుర్కోనెందుకు అవకాశం మండలి వేదికగా లభిస్తుంది. ఆ అవకాశం వదులుకోకూడదని టీడీపీ భావిస్తోంది. ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకుని మండలి రద్దు అవకుండా ప్రయత్నాలు ప్రారంభించింది.

    అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

    మరోవైపు మండలిలో ఛైర్మన్ ఆదేశాలను కార్యదర్శి అమలు చేయడం లేదని దీపక్ రెడ్డి గతంలోనే పిటీషన్ దాఖలు చేశారు. సెలెక్ట్ కమిటీకి పంపిన పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులపై కార్యదర్శి బలకృష్ణమాచార్యులు తదుపరి చర్యలు తీసుకోలేదని, ఫలితంగా ప్రభుత్వం నుంచి తన పదవి విరమణ వయస్సు ఏడాది కాలం పొడిగింపు పొందారని పోటీషన్ లో పేర్కొన్నారు.