https://oktelugu.com/

108 స్కామ్ విజయ సాయిరెడ్డి మెడకు చుట్టుకుంటుందా?

టీడీపీ హయాంలో ఇ.ఎస్.ఐ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే..టీడీపీ ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు విషయంలో రూ.300 కోట్ల అవినీతికి వైసీపీ నేత ఒకరు పాల్పడ్డారన్న విషయాన్ని బయట పెట్టింది. దీనిపై టీడీపీ నాయకుడు పట్టాభి ఆరోపణలు చేయడంతో హౌస్ అరెస్ట్ కు గురయ్యారు. వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి తన అల్లుడికి లబ్ది చేకూరే విధంగా 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు అమలులో ఉండగా […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 23, 2020 9:44 am
    Follow us on


    టీడీపీ హయాంలో ఇ.ఎస్.ఐ కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేస్తే..టీడీపీ ప్రభుత్వం 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు విషయంలో రూ.300 కోట్ల అవినీతికి వైసీపీ నేత ఒకరు పాల్పడ్డారన్న విషయాన్ని బయట పెట్టింది. దీనిపై టీడీపీ నాయకుడు పట్టాభి ఆరోపణలు చేయడంతో హౌస్ అరెస్ట్ కు గురయ్యారు. వైసీపీ నాయకులు, ఎంపీ విజయసాయి రెడ్డి తన అల్లుడికి లబ్ది చేకూరే విధంగా 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు అమలులో ఉండగా రద్దు చేసి కొత్త సంస్థకు కాంట్రాక్టు ఇచ్చిన విషయాన్ని టీడీపీ నాయకులు పట్టాభి వెల్లడించారు.

    గవర్నర్ ను కలిసిన జగన్ ఏమి చర్చించారంటే..!

    ఈ కాంట్రాక్టు కేటాయింపులో రూ.300 కోట్లు స్కామ్ జరిగిందని ఇందుకు ఎంపీ విజయ సాయిరెడ్డి కారణమని పట్టాభి తెలిపారు. ఇందుకు తగిన ఆధారాలు అన్ని తన వద్ద ఉన్నాయని చెప్పుకొచ్చారు. మరోవైపు ఇదే అంశం కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో టీడీపీ సానుభూతి పరులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. 108 స్కామ్ ఇన్ ఏపీ పేరుతో సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ ని ట్రెండింగ్ లో ఉంచుతున్నారు. దీంతో సోషల్ మీడియా ఫాలోవర్స్ అందరికీ ఈ విషయం విదితమే.

    అరెస్టులతో జగన్.. కోర్టులతో టీడీపీ నేతలు

    సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే విజయ సాయిరెడ్డి ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా స్పందించలేదు, మరోవైపు మీడియా ముందు ఈ విషయంపై స్పందించకుండా తప్పించుకుని తిరుగుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. కారోనా టెస్టింగ్ కిట్ ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించిన బీజేపీ అధ్యక్షుడు కన్నాపై తీవ్ర విమర్శలు చేసిన సాయిరెడ్డి, టీడీపీ నేరుగా తనపై విమర్శలు గుప్పించినా స్పదించకపోవడం విమర్శలకు తావిస్తోంది. మాజీ మంత్రి అచ్చెన్నాయుణ్ని అరెస్ట్ చేసిన ప్రభుత్వం మరి ఎంపీ విజయ సాయిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయడం లేదని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఎంపీ విజయ సాయిరెడ్డిని జగన్ కొంత కాలంగా దూరంగా ఉంచుతున్నారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు సీఎం జగన్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే అంశం ఇప్పుడు ఆసక్తి కరంగా మారింది