Minister Gudivada Amarnath : ట్రోల్ ఆఫ్ ది డే : మంత్రి అమ‌ర్నాథ్ కోడిగుడ్డు క‌థ‌.. విన్న‌వారు జుట్టు పీక్కున్నార‌ట!

  YSRCP Minister Gudivada Amarnath  : ఆ ఏపీ మంత్రి మాట‌లు విచిత్రంగా ఉంటాయి. పోలిక పొంత‌న ఉండవు. అర్థం లేని మాట‌లు మాట్లాడ‌టంలో ఆయ‌న దిట్ట‌. అసంద‌ర్భ ప్రేలాప‌న‌ల్లో ఆయ‌న‌ది అందె వేసిన చేయి. నాలుక మ‌డ‌తెట్ట‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. కామెడీలు, డ్యాన్సులు చేయ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురాక‌పోయినా.. మంచి ఎంట‌ర్ టైన్మెంట్ అందిస్తున్నాడు. అత‌ని కంటే ఘ‌నుడు అచంట మ‌ల్ల‌న్న అన్న‌ట్టు.. మిగిలిన మంత్రుల‌తో పోటీ ప‌డుతున్నాడు. తాజాగా […]

Written By: SHAIK SADIQ, Updated On : February 11, 2023 8:22 pm
Follow us on

 

YSRCP Minister Gudivada Amarnath  : ఆ ఏపీ మంత్రి మాట‌లు విచిత్రంగా ఉంటాయి. పోలిక పొంత‌న ఉండవు. అర్థం లేని మాట‌లు మాట్లాడ‌టంలో ఆయ‌న దిట్ట‌. అసంద‌ర్భ ప్రేలాప‌న‌ల్లో ఆయ‌న‌ది అందె వేసిన చేయి. నాలుక మ‌డ‌తెట్ట‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. కామెడీలు, డ్యాన్సులు చేయ‌డం ఆయ‌న‌కు ప‌రిపాటి. రాష్ట్రానికి ప‌రిశ్ర‌మ‌లు తీసుకురాక‌పోయినా.. మంచి ఎంట‌ర్ టైన్మెంట్ అందిస్తున్నాడు. అత‌ని కంటే ఘ‌నుడు అచంట మ‌ల్ల‌న్న అన్న‌ట్టు.. మిగిలిన మంత్రుల‌తో పోటీ ప‌డుతున్నాడు. తాజాగా ఆయ‌నో క‌థ చెప్పారు. ఆ కథేంటో ? దాని సంగ‌తేంటో తేలుద్దాం రండి.

మ‌న ఏపీ మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ తాజాగా హైదరాబాద్ వెళ్లారు. వెళ్లిన‌వాడు గ‌మ్మున‌ ఉండ‌కుండా.. హైద‌రాబాద్లో జ‌రిగే ఫార్ములా ఈ రేస్ తిల‌కించ‌డానికి ప‌రుగున వెళ్లారు. మ‌న మంత్రిగారికి ముందే నోటి తుత్త‌ర ఎక్కువ‌. ఏది ప‌డితే అది మాట్లాడేస్తారు. అలా అనుకుంటే నేనేం చేయ‌గ‌ల‌ను అంటూ ఆ త‌ర్వాత మాట మ‌డ‌తెట్టేస్తారు. ఇప్పుడు ఫార్ములా ఈ రేస్ తెలంగాణ‌లో నిర్వ‌హించ‌డం గ‌ర్వ‌కారణం అంటూ పొగ‌డ్త‌లు కురిపించారు. అక్క‌డితో ఆగ‌కుండా ఏపీ ప్ర‌జ‌లు కూడా హైద‌రాబాద్ నిర్మాణంలో భాగ‌స్వాములు అంటూ లెక్చ‌రిచ్చారు. అది అంద‌రికీ తెలిసిన విష‌య‌మే క‌దా. మంత్రిగారూ మీరు కొత్త‌గా చెప్పేది ఏముంది. ఫార్ములా ఈరేస్ నిర్వ‌హించ‌డానికి.. హైద‌రాబాద్ నిర్మాణంలో ఏపీ ప్ర‌జ‌ల క‌ష్టం ఉంద‌ని చెప్ప‌డానికి ఏమైనా సంబంధం ఉందా ?. అది త‌మ‌రికే తెలియాలి.

మంత్రిగారు అంత‌టితో ఆగారు కాబ‌ట్టి స‌రిపోయింది. ఫార్ములా ఈ రేస్ నిర్వ‌హ‌ణ‌లో మా జ‌గ‌న‌న్న క‌ష్టం కూడా ఉంద‌ని చెప్ప‌లేదు. లేదంటే కేసీఆర్ అండ్ కో దిక్కుతోచ‌క చ‌చ్చేవారు. మంత్రి గారి మాట‌ల‌కు పొంత‌న ఉండ‌ద‌ని ఊరికే అన‌లేదు. ఇంకా ఆయ‌న చెప్పిన క‌థ ఒక‌టి చెప్పాల్సిన బాకీ ఉంది. ఇప్పుడు ఆ క‌థ‌లోకి వెళ్ధాం. ఆ క‌థ అర్థం చేసుకున్న వారికి అర్థం చేసుకున్నంత. మంత్రి అమ‌ర్నాథ్ ఫార్ములా ఈరేస్ తిల‌కిస్తున్న స‌మ‌యంలో అక్క‌డున్న విలేక‌రులు ఊరుకోలేదు. మంత్రిగారిని ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఏపీలో ఇలాంటి రేస్ ఎప్పుడు నిర్వ‌హిస్తార‌ని ప్ర‌శ్నించారు. దీంతో మంత్రిగారి మైండ్ దొబ్బిన‌ట్టుంది. ఏదో అర్థంలేని క‌థ ఒక‌టి సెల‌విచ్చారు.

“ కోడి గుడ్డు పెట్ట‌గ‌ల‌దు. కానీ కోడి. కోడిని పెట్ట‌లేదుగా. కోడి గుడ్డు పెట్టాలి. పొద‌గాలి. పిల్లలు లేపాలి. పెరిగి పెద్ద‌వ్వాలి. ఇప్పుడే ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కోడి గుడ్డు పెట్టింది. పెట్ట కింద మార్చ‌డానికి టైం ప‌డుతుంది “ అంటూ విచిత్ర‌మైన జ‌వాబు చెప్పారు. మంత్రిగారి కోడిగుడ్డు థియ‌రీ అర్థం కాక పాపం విలేక‌రులు జుట్టు పీక్కున్నార‌ట‌. కోడేంటి.. కోడి గుడ్డేంటి.. పెట్ట‌గా మార్చ‌డమేంటి.. అయ్య బాబోయ్ అంటూ అక్క‌డి నుంచి ల‌గెత్తార‌ట‌. ఇదేదో సినిమాలో కామెడీలా ఉందే అంటూ అక్క‌డి జ‌నం న‌వ్వుకున్నార‌ట‌. మంత్రి గారూ ఆ పోలికేంటి. ఆ స‌మాధాన‌మేంటి. వ‌హ్వా. మీకు మీరే సాటి. మ‌న ఏపీ మంత్రులెవ‌రూ మీ ద‌రిదాపుల్లోకి కూడా రాలేరు. అంత అమోఘం మీ క‌థా నైపుణ్యం. మంత్రి గారి క‌థ జ‌గ‌నన్న‌కు త‌ప్ప దేవుడికి కూడా అర్థం కాదు.