
Funny Marriege : పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత దేశంలో సాంప్రదాయాలు ఎక్కువ.. ముఖ్యంగా దక్షిణాదిలో అవి ఇంకా ఎక్కువ. ఇంట్లో ఆడవాళ్లకు చేసే వేడుకలు ఇంకా ఎక్కువ. అలాంటి సందర్భంలో గంధం పూయడం, గాజులు పెట్టడం, సారెలు సమర్పించడం ఒక ఆనవాయితీ.. గతంలో కొంత పరిధి మేరకు మాత్రమే ఇలాంటి వేడుకలు చేసేవారు. కానీ ఇప్పుడు ఆర్థిక స్థిరత్వం పెరగడంతో ఆడంబరంగా వేడుకలు చేస్తున్నారు. దీని కోసమే ప్రత్యేకంగా కొన్ని కొన్ని కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయి.. ప్రతి వేడుకను గ్రాండ్ గా చేస్తున్నాయి.
ఇక సంప్రదాయ కుటుంబాల్లో ఆడవాళ్లకు సంబంధించి ప్రతిదీ వేడుక.. ఆడపిల్ల పుట్టడం, నామకరణం, పుట్టినరోజు, చెవులు కుట్టించిన రోజు, పెద్దమనిషి అయినప్పుడు, గర్భిణిగా ఉన్నప్పుడు, బాబు లేదా పాప పుట్టినప్పుడు వారికి బారసాల.. ఇలాంటి వేడుకలు చేస్తారు. సాధారణంగా పెళ్లయిన ప్రతి ఆడపిల్ల గర్భిణిగా ఉన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ముఖ్యంగా తన భర్త సమక్షంలో ఉన్నప్పుడు ఇంకా ఆనందంగా ఉంటుంది. అదే సమయంలో ఆమెకు సీమంతం లాంటి వేడుకలు చేస్తారు.. ముత్తయిదువలు వచ్చి ఆమెకు గంధం పూసి, సారె పెడతారు. పండంటి బిడ్డకు జన్మ ఇవ్వాలని దీవిస్తారు.
కానీ తమిళనాడు ప్రాంతంలో ఇలాంటి ఓ సీమంతం వేడుక నవ్వులు పూయించింది.. గర్భం దాల్చిన ఓ మహిళకు ఆమె పుట్టింటి వాళ్లు సీమంతం వేడుక నిర్వహించారు. ఇందులో భాగంగా ఆ గర్భిణిని, ఆమె భర్తను ఒక వేదికపై కూర్చోబెట్టి… ఒక్కొక్కరుగా సారె పెడుతున్నారు.. ఈ క్రమంలో ఒక మహిళ వచ్చి సదరు గర్భిణీకి గంధం పూసింది. చేతికి గాజులు తొడిగింది.. పక్కనే ఉన్న ఆమె భర్తకు కూడా గాజులు తొడగబోయింది. దీనికి అతడు వారించాడు. కానీ అలాగే పెట్టబోతుండగా చేతులు వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.. గాజులు ఇన్నాళ్లు ఆడవాళ్ళే తొడుక్కుంటారు అనుకున్నాము. కానీ ఇప్పుడు మగవాళ్ళకు కూడా తొడగాలని ప్రయత్నం చేస్తున్నారు.. కాల మహిమ అంటూ నెటిజన్లు వ్యాఖ్యలు చేస్తున్నారు.