YSRCP -Rajya Sabha: రాజ్యసభ సభ్యుల ఎన్నిక వ్యవహారం మెడ మీద కత్తిలా మారింది. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ వ్యవహరిస్తున్న తీరుతో కేసీఆర్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఏపీలో రాజ్యసభ సీట్లలో ఇద్దరు తెలంగాణ వారికి చోటు కల్పించడంతో కేసీఆర్ అంతర్మథనంలో పడిపోయినట్లు తెలుస్తోంది. బీసీ సంఘాల జాతీయ నేత ఆర్. కృష్ణయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడంతో రాజకీయాలు కొత్త మలుపులు తిరగనున్నాయి. ఇందులో రాజకీయ వ్యూహమేదైనా ఉందా అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి. లేకపోతే ఏపీలో సీట్ల కోసం తెలంగాణ వారిని ఎంపిక చేయడంల ఔచిత్యమేమిటో ఎవరికి అర్థం కావడం లేదు.
దీంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు పాలుపోవడం లేదు. ఇప్పటికే గులాబీ బాస్ రాజ్యసభ సభ్యుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు ఇందులో ఒకటి నమస్తే తెలంగాణ తెలంగాణ పత్రిక ఎండీ దామోదర్ రావు, హెటిరో సంస్థ చైర్మన్ పార్థసారధిరెడ్డి, నటుడు ప్రకాశ్ రాజ్ కు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కూడా అగ్రకులాలకు చెందిన వారు కావడం గమనార్హం. దీంతో ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ డైలమాలో పడినట్లు చెబుతున్నారు. కేసీఆర్ ఎంపిక చేసిన ముగ్గురు కూడా అగ్రకులాలకు చెందిన వారే కావడం గమనార్హం.
Also Read: R Krishnaiah: విఫల ప్రయోగాన్ని నమ్ముకున్న జగన్.. ఆర్.క్రిష్ణయ్య రాజ్యసభ ఎంపిక వెనుక కథా ఇదా?
ఏపీలో 50 శాతం టికెట్లు బీసీలకే ఇస్తున్నామని జగన్ చెబుతుండటంతో కృష్ణయ్యకు చోటు కల్పించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఎన్నికల వ్యూహంలో భాగంగానే జగన్ ఇలా చేస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. జగన్ నిర్మల్ కు చెందిన అడ్వకేట్ నిరంజన్ రెడ్డికి కూడా రాజ్యసభ సభ్యత్వం కల్పిస్తున్నారు. దీంతో జగన్ మదిలో ఏముందనే దానిపై ఇంకా స్పష్టత రాలేు. కానీ మొత్తానికి ఏదో ఊహించే ఇలా చేస్తున్నారనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో టీడీపీని దెబ్బతీసే వ్యూహంలో భాగంగానే కృష్ణయ్యకు పదవి ఇచ్చినట్లు చెబుతున్నారు. ఒకప్పుడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న కృష్ణయ్యను ఎంచుకుని బీసీలకు తాము ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పేందుకే ఇలా చేస్తున్నారనే మరో వాదన కూడా ఉంది. జగన్ వైఖరితో ఇప్పుడు కేసీఆర్ నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయింది. కేసీఆర్ మళ్లీ అభ్యర్థులను మార్చి కొత్తగా జాబితా ప్రకటించాల్సిన అవసరం ఏర్పడింది.
నామినేషన్లకు ఈనెల 19 గురువారం చివరి రోజు కావడంతో అభ్యర్థుల వెల్లడించాల్సిన అవసరం వచ్చింది. జగన్ బీసీ నేతకు టికెట్ ఇవ్వడంతో ఇక్కడ కూడా అయితే బీసీ లేకపోతే ఎస్సీ నేతను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఎస్సీ నేత మోత్కుపల్లి నర్సింహులుకు అవకాశం కల్పిస్తారనే ప్రచారం సాగుతోంది. మొత్తానికి జగన్ తీసుకున్న నిర్ణయంతో కేసీఆర్ కూడా తన నిర్ణయం మార్చుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.
Also Read:Janasena: జగన్ ప్రసంగం పది నిమిషాలు కూడా జనాలు వినడం లేదు
Recommended Videos