https://oktelugu.com/

Nara Lokesh: ఇన్నాళ్లకు లోకేష్ పాదయాత్రకు ఊపు

నెల్లూరు జిల్లా నుంచి లోకేష్ యాత్ర కొత్త పుంతలు తొక్కనుంది. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి లోకేష్ యాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది.

Written By:
  • Dharma
  • , Updated On : June 10, 2023 / 06:38 PM IST

    Nara Lokesh

    Follow us on

    Nara Lokesh: టీడీపీ పూర్వ వైభవం కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేపడుతున్నారు. ప్రస్తుతం కడప జిల్లా బద్వేలులో యాత్ర కొనసాగుతోంది. జనవరి 27న చిత్తూరు జిల్లా కుప్పంలో పాదయాత్ర ప్రారంభమైంది. 400 రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో 4 వేల కిలోమీటర్ల పాటు లోకేష్ నడవనున్నారు. రాయలసీమలో ఇప్పటికే మూడు జిల్లాల్లో యాత్ర పూర్తయ్యింది. చిత్తూరు, అనంతపురం, కర్నూలులో యాత్ర పూర్తవ్వగా..కడప జిల్లాలో చివరి దశకు వచ్చింది. జూన్ 13న నెల్లూరు జిల్లాలో యాత్ర అడుగుపెట్టనుంది.

    ప్రారంభంలో వైసీపీ సర్కారు అడుగడుగునా అడ్డుతగిలింది. లోకేష్ యాత్రకు అడ్డంకులు సృష్టించింది. అయినా లోకేష్ వెనుకడుగు వేయలేదు. ధైర్యంగా ముందుకు సాగారు. పాదయాత్ర చేయలేరు అన్న అంచనాలను పటాపంచలు చేస్తూ లోకేష్ ముందుకు సాగుతున్నారు. అది అభినందనీయమే అయినా.. యాత్రలో ఎటువంటి సంచలనాలు నమోదుకాలేదు. కేవలం టీడీపీ శ్రేణులు బలంగా యాత్రను ముందుకు తీసుకెళుతున్నాయి తప్ప.. లోకేష్ ప్రత్యేకతలు అంటూ ఏమీ లేవు. పరిణితి కలిగిన ప్రసంగాలు చేయలేకపోవడం మైనస్ గా మిగిలింది.

    అయితే నెల్లూరు జిల్లా నుంచి లోకేష్ యాత్ర కొత్త పుంతలు తొక్కనుంది. ఈ నెల 13న ఉమ్మడి నెల్లూరు జిల్లాలోకి లోకేష్ యాత్ర ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ పాదయాత్రకు అసలైన ఊపు తెచ్చే రాజకీయ పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైసీపీ బహిష్కరించిన ముగ్గురు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లోకేష్ సమక్షంలోనే టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

    ఈ ముగ్గురు నేతలు బలమైన నేపథ్యం ఉన్న నాయకులు. నెల్లూరు జిల్లాలో మంచి పట్టున్న నేతలు. వారి ఎంట్రీ గ్రాండ్ గానే ఉంటుంది. వారు చేరే క్రమంలో భారీ జన సమీకరణ ఉంటుంది. సో ఇన్నాళ్లూ లోకేష్ పాదయాత్రకు రాని ఊపు నెల్లూరు జిల్లాలో రాబోతున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకూ లోకేష్ యాత్రను టీడీపీ క్యాడర్ మాత్రమే భుజాన వేసుకుని నడిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి కానీ, కొత్త నేతల నుంచి కానీ ఎక్కడా మద్దతు లభించడం లేదు. నెల్లూరులో ఎమ్మెల్యేల చేరికలు టర్నింగ్ పాయింట్ గా మారబోతున్నాయి.