https://oktelugu.com/

Ponniyin Selvan – Part 2: నిర్మాతలకు పంగనామం పెట్టిన ‘పొన్నియన్ సెల్వన్ 2’..ఎన్ని కోట్లు నష్టమో తెలుసా!

ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 170 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిందట.

Written By:
  • Vicky
  • , Updated On : June 10, 2023 / 06:29 PM IST
    Follow us on

    Ponniyin Selvan – Part 2: మన తెలుగు ఆడియన్స్ బాహుబలి చిత్రం గురించి ఎంత గొప్పగా అయితే చెప్పుకుంటామో, తమిళనాడు ప్రజలు పొన్నియన్ సెల్వన్ గురించి అంత గొప్పగా చెప్పుకుంటారు. గత ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ క్రేజీ ప్రాజెక్ట్ సంచలన విజయం సాధించింది. బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల కనకవర్షం కురిపించి, డైరెక్టర్ మణిరత్నం కి బిగ్గెస్ట్ కం బ్యాక్ చిత్రం గా నిల్చింది.

    అలాంటి సెన్సేషన్ సృష్టించిన సినిమాకి సీక్వెల్ అంటే కచ్చితంగా ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ భారీ అంచనాలు పెట్టుకుంటారు. కానీ సీక్వెల్ బాగానే ఆడింది కానీ, ఆశించి స్థాయిలో మాత్రం వసూళ్లను రాబట్టలేదు అనే చెప్పాలి.రీసెంట్ గానే అమెజాన్ ప్రైమ్ లో కూడా ఈ సినిమా అందుబాటులోకి వచ్చేసింది. ఇప్పుడు ఈ చిత్రం క్లోసింగ్ కలెక్షన్స్ ఎంత? , అన్నీ భాషలకు కలిపి బ్రేక్ ఈవెన్ అయ్యిందా లేదా అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాము.

    ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం ఈ చిత్రాన్ని అన్నీ ప్రాంతీయ భాషలకు కలిపి 170 కోట్ల రూపాయలకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయిందట. తెలుగు లో ఈ చిత్రానికి 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాగే తమిళం లో 136 కోట్లు, కర్ణాటక లో 21 కోట్లు, కేరళలో 17 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 23 కోట్లు, మరియు ఓవర్సీస్ లో 126 కోట్ల రూపాయిల గ్రాస్ ని వసూలు చేసింది. మొత్తం మీద అన్నీ భాషలకు కలిపి ఈ సినిమా 339 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.

    ఈ గ్రాస్ వసూళ్లకు షేర్ లెక్కగడితే 163 కోట్ల రూపాయలకు తేలిందట. అంటే దాదాపుగా 7 కోట్ల రూపాయిల నష్టం వాటిల్లింది అన్నమాట. అలా ఓవరాల్ గా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ చిత్రం కేవలం హిట్ గా మాత్రమే నిలిచింది. మొదటి భాగానికి దాదాపుగా 500 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.