YSR Congress Party: కార్పొరేట్ తరహాలో పార్టీ కార్యాలయాలు, సోషల్ మీడియా సైన్యం, సభలు, సమావేశాల్లో లెక్కలేనంత ఖర్చు.. ఇదీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ దర్పం. కానీ ఆ పార్టీ మాత్రం తాము ఖర్చుకు దూరమని చెబుతోంది. 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 చోట్ల గెలిచిన ఆ పార్టీ తాను కేవలం రూ.80 లక్షలు ఖర్చు చేసినట్టు చూపుతోంది.దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు 2020-21లో వచ్చిన విరాళాల గురించి అసోసియేషన్ ఆప్ డెమెక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఇందులో వైసీపీకి విరాళాల రూపంలో రూ.108 కోట్లు రాగా.. ఖర్చు పెట్టినట్టు చూపుతున్నది కేవలం రూ.80 లక్షలు మాత్రమే. వచ్చిన విరాళాల్లో కోటి రూపాయలు కూడా ఖర్చు చేయలేని స్థితిలో వైసీపీ ఉండడం ప్రస్తావించాల్సిన విషయం. ఎవరు ఇస్తున్నారో తెలియని ఎలక్టోరల్ బాండ్ల రూపంలో నే వైసీపీకి ఎక్కువ నిధులు వచ్చాయి. మొత్తానికి అధికార పార్టీ అనే అడ్వాంటేజ్‌ను వైసీపీ అన్ని రకాలుగా వాడుకుంటోందని.. ఈ లెక్కలతో స్పష్టమవుతోంది.
వాస్తవానికి వైసీపీకి పారిశ్రామికవేత్తల సపోర్టు ఎక్కువ. పారిశ్రామికరంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగన్ కు పారిశ్రామికవేత్తలే ఎక్కవుగా స్నేహితులు ఉన్నరు. బహుశా వారే బాండ్ల రూపంలో ఎక్కువ మొత్తంలో విరాళాలు ఇచ్చుంటారన్న అనుమానాలు ఉన్నాయి. భారీ ప్రైవేటు సైన్యమున్న వైసీపకి ఖర్చు కంటే ఆదాయమే దాదాపు వంద రెట్లు ఎక్కువ. ఎలా చూసుకున్నా ఆ పార్టీకి ఆదాయం అనేది ప్రధాన వనరుగా ఉందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు.
Also Read: TDP Mahanadu 2022: టీడీపీలో ‘మహా’ జోష్.. శ్రేణులకు టానిక్ లా పనిచేసిన మహానాడు
అయితే ఏపీలో ప్రధాన విపక్షం తెలుగుదేశం పార్టీ మాత్రం ఆదాయం తక్కువ. ఖర్చు ఎక్కువగా చూపింది. తెలుగుదేశం పార్టీకి రూ. మూడున్నర కోట్లు కూడా విరాళాలు రాలేదు.. కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా పెట్టేసింది. ఆ పార్టీ రూ.54.76 కోట్లు ఖర్చు చేసింది. ఇక తెలంగాణాలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌కు రూ.37.65 కోట్ల ఆదాయం రాగా రూ.22.34 కోట్లు వెచ్చించింది. టీఆర్ఎస్‌కు ఆదాయం తక్కువగానే ఖర్చు మాత్రం రీజనబుల్‌గానే చూపించింది. కానీ ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించింది. తన మార్కును చూపించింది. తమకు ఆదాయం ఎక్కువేనని నిరూపించుకుంది.