YSR Congress Party Formation Celebrations: ఒక రాజకీయ పార్టీకి ఆవిర్భావ దినోత్సవం అంటే ఉనికిని చాటుకునే పెద్ద అవకాశం. ఆ పార్టీకి అన్నింటికంటే ఈ తేది ఎంతో ముఖ్యం. నేటికి వైసీపీ ఏర్పాటై దాదాపు 12 ఏండ్లు కావస్తోంది. అయితే వైసీపీలో కూడా మిగతా పార్టీ లాగే నిరాశ కనిపిస్తోంది. ఒకప్పుడు ఆవిర్భావ సభను గ్రాండ్ గా నిర్వహించిన కేడర్.. ఇప్పుడు అసలు పట్టించుకోవట్లేదు.

జగన్ ఒక్కడిగా స్థాపించిన పార్టీ ఈరోజు అఖండ మెజార్టీతో అధికారంలో ఉంది. అయితే జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీలో ఉన్న జోష్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక రానురాను తగ్గిపోతోంది. ఏదో పార్టీ ఆఫీసుల్లో జెండా ఎగరేసి స్వీట్లు పంచుకోవడం వరకే పరిమితం అవుతున్నారు కేడర్. చాలావరకు జేబుల్లోంచి ఖర్చుపెట్టడం తగ్గించుకుంటున్నారు.
Also Read: మంత్రుల మార్పు వచ్చే ఎన్నికలపై ఎఫెక్ట్ చూపుతుందా.. ఏ మాత్రం తేడా కొట్టిన అంతే..
కాకపోతే ప్రభుత్వంలో అధికారంలో ఉన్న కొద్ది మంది నేతలు, వ్యాపారస్తులు మాత్రమే అంతో ఇంతో ఖర్చు పెట్టుకుంటున్నారు. మీరు కూడా కేవలం ఈవెంట్లు ఉన్న సమయంలోనే ఖర్చు పెడుతూ.. మిగతా సమయంలో పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇది ఇలాగే కొనసాగితే పార్టీకి తీవ్ర నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు వైసీపీని కార్యకర్తలు ఓన్ చేసుకోవడం వల్లనే పార్టీ అధికారంలోకి రాగలిగింది.

కానీ ఇలా మనది కాదు అన్నట్టు ఉండిపోతే మాత్రం.. పార్టీ భావజాలం కేడర్ కు దూరమైపోతుంది. ఏ పార్టీకి అయినా కిందిస్థాయి కేడర్ చాలా ముఖ్యం. వారిని దూరం చేసుకుంటే మాత్రం.. కాంగ్రెస్ కు పట్టిన గతే పడుతుంది. కాబట్టి పార్టీకి సంబంధించిన ప్రతి ప్రోగ్రాంలో కిందిస్థాయి కేడర్ పాల్గొంటేనే జనాల్లో పార్టీపై పాజిటివ్ వేవ్ ఉంటుంది. మరి జగన్ ఇప్పటికైనా కిందిస్థాయి కార్యకర్తల విషయంలో ఏమైనా కేర్ తీసుకుంటారా లేదా చూడాలి.
Also Read: కాంగ్రెస్ ‘హస్తం’ ఖతం.. దాన్నుంచే ఆమ్ఆద్మీ ‘చీపురు’ పుట్టుకొస్తోందా? పేలుతున్న మీమ్స్