https://oktelugu.com/

YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామం.. అతడి అరెస్ట్ ఖాయం

YS Viveka Murder Case: ఏపీ సీఎం జగన్ బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య ఎలా జరిగిందో తాజాగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు ఈ క్రమంలోనే మరొక కీలక వ్యక్తి అరెస్ట్ కు రెడీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం. వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. మూడో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కూడా […]

Written By:
  • NARESH
  • , Updated On : September 16, 2021 / 10:28 AM IST
    Follow us on

    YS Viveka Murder Case: ఏపీ సీఎం జగన్ బాబాయి.. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హత్య ఎలా జరిగిందో తాజాగా సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు ఈ క్రమంలోనే మరొక కీలక వ్యక్తి అరెస్ట్ కు రెడీ అయినట్టుగా విశ్వసనీయ సమాచారం.

    వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డిని అరెస్ట్ చేయగా.. మూడో నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. బుధవారం గంగిరెడ్డిని కడపకు తీసుకొచ్చి విచారించడంతో అతడిని అరెస్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గురువారం ఇతడిని కోర్టులో హాజరుపరుచనున్నట్టు సమాచారం.

    బుధవారం రాత్రి సీన్ రీకన్ స్ట్రక్షన్ చేసిన సీబీఐ అధికారులు ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, దస్తగిరి ఎలా ఇంట్లోకి ప్రవేశించారు? ఎక్కడెక్కడ దాక్కున్నారు? ఎలా వెళ్లారు? పారిపోయారన్నది పూర్తిగా నిగ్గుతేల్చి వీడియో తీశారు. హత్య ఎలా జరిగిందో కల్పిత పాత్రలతో సీబీఐ అధికారులు వీడియో రీషూట్ చేశారు.

    ఇక ఈ సమయంలోనే వైఎస్ వివేకా కూతురు సునీతను అధికారులు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసులో నిందితుల పాత్రపై చర్చించినట్టు సమాచారం.

    2019 మార్చి 14న రాత్రి ఇంటికి వచ్చిన వివేకాను 15న ఉదయం చంపేశారు. ఇంటికి వచ్చిన సమయంలో కేవలం ఎర్ర గంగిరెడ్డి మాత్రమే ఆయన వెంట ఉన్నారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులు వైఎస్ వివేకా ఇంట్లోకి చొరబడి హత్య చేసి ఉంటారని సీబీఐ నిర్ధారించింది. వారిలో ఎర్ర గంగిరెడ్డి పాత్ర కూడా ఉందని సీబీఐ నిర్ధారణకు వచ్చింది.