YS Jagan: మంత్రివర్గ విస్తరణపై నే నేతల ఆశలు

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావహులు పదవుల కోసం వేచి చూస్తున్నారు. తమకు అవకాశం వస్తుందో లేదో అనే అనుమానంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరు పదవులు కావాలని ఆశిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి వరించాలని ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా అధినేత జగన్ మెప్పు పొందాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాదారు 90 శాతం మందిని మారుస్తారని తెలియడంతో […]

Written By: Srinivas, Updated On : September 16, 2021 10:43 am
Follow us on

YS Jagan: ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆశావహులు పదవుల కోసం వేచి చూస్తున్నారు. తమకు అవకాశం వస్తుందో లేదో అనే అనుమానంతో చాలా మంది ఎదురు చూస్తున్నారు. సీనియర్ల నుంచి జూనియర్ల వరకు అందరు పదవులు కావాలని ఆశిస్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా మంత్రి పదవి వరించాలని ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా అధినేత జగన్ మెప్పు పొందాలని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాదారు 90 శాతం మందిని మారుస్తారని తెలియడంతో కొత్త ముఖాలు తమ ప్రయత్నాలకు పని చెబుతున్నారు. జగన్ దృష్టిలో పడి పదవి సాధించాలని చూస్తున్నారు.

అయితే మంత్రివర్గ విస్తరణలో జగన్ ఎవరి ప్రమేయం ఉండనివ్వరని తెలుసు. అందుకే నేరుగా ఆయన కనుసన్నల్లో పడేందుకు నేతలు తాపత్రయపడుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో సామాజిక వర్గాలకే పెద్దపీట వేస్తారని తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణలో చోటు సంపాదించేందుకు నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్తవారు చాలా మంది పదవులపై ఆశలు పెంచుకుని తమ పలుకుబడి ఉపయోగించుకోవాలని ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో జగన్ తన దృష్టిలో ఉన్న వారికి మాత్రం కచ్చితంగా న్యాయం చేస్తారనే పేరుంది. ఆయన మాట ఇస్తే దానికి కట్టుబడి ఉంటారనే తెలుస్తోంది. అందుకే ఆయన దగ్గర మాట తీసుకునేందుకు నేతలు పోటీ పడుతున్నారు. రోజు ఆయన చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ జపం చేస్తున్నారు. మంత్రి పదవి కోసం ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. జగన్ మెప్పు పొంది ఆయన మాట తీసుకోవాలని ముందుంటున్నారు. రాబోయే విస్తరణలో కచ్చితంగా పదవి సాధించడమే లక్ష్యంగా కదులుతున్నారు.

శాసనమండలి రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భంలో ఎమ్మెల్సీల పదవులపై భరోసా లేకుండా పోతోంది. దీంతో మంత్రి పదవి కోసమే ఆరాటపడుతున్నారు. ఒకవేళ మండలి రద్దయితే వారి పదవులు హుష్ కాకే. దీంతో ఎమ్మెల్సీ కంటే మంత్రి పదవి కావాలనే పట్టుపడుతున్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా జగన్ ప్రభుత్వంలో ఒక్కసారైనా మంత్రి పదవులు సాధించాలని చూస్తున్న నేతల ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాల్సిందే.