YS Sharmila: తెలంగాణ సీఎం అవ్వాలన్నది వైఎస్ షర్మిల కోరికగా తెలుస్తోంది. అందుకోసమే తెలంగాణలో ఆమె వేగంగా అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నివదిలిపెట్టడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న అంశం దొరికిన దానిని హైలెట్ చేస్తూ జనంలోని వెళ్లేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏపీలో షర్మిల అన్న జగన్ ఇప్పటికే అక్కడ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాడు. ఇక తెలంగాణలో ముఖ్యమంత్రి పీఠం అధిరోహించడమే షర్మిల ముందున్న లక్ష్యమని వైఎస్సార్ అభిమానులు అనుకుంటున్నారు. ఏపీలో జగన్ ఎలాగైతే పాదయాత్రలు చేసి జనం అభిమానాన్ని చూరగొన్నారో అదేవిధంగా రాష్ట్రంలో పాదయాత్రలు చేసి అధికారంలోకి రావాలని షర్మిల భావించింది.

పాదయాత్రకు బ్రేక్..
ఈ ఏడాది ఖమ్మం జిల్లా వేదికగా వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన షర్మిల తెలంగాణలోనూ రాజన్న రాజ్యం తీసుకొస్తానని చెప్పింది. అదే విధంగా కొన్నిరోజుల పాటు యాక్టివ్‌గా రాజకీయ సమీకరణాలు జరిపింది. రాష్ట్రంలో ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో వైఎస్సార్ అభిమానులు, ఆయన సింపతిదారులు ఉన్నారు. అటువంటి వారి జాబితాను షర్మిల ముందే ప్రిపేర్ చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వంపై షర్మిల విమర్శణ బాణాలు ఎక్కుపెట్టి వారికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నాలు చేసింది. కేవలం విమర్శలతో పనికాదని భావించిందో ఏమో తెలీదు గానీ, ఒక్కసారిగా పాదయాత్ర చేస్తానని ప్రకటించింది. అనుకున్నట్టే చేవెళ్ల నుంచి పాదయాత్ర ప్రారంభించి ముందుగా ఉద్యోగాల నోటిఫికేషన్ రావడం లేదని ఆత్మహత్యలు చేసుకున్న నిరుద్యోగుల కుటుంబాలను పరామర్శించిన షర్మిల.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా నల్గొండలోనే ఆమె పాదయాత్రకు బ్రేక్ ఇచ్చారు.
వ్యూహం మార్చిన షర్మిల.. ఓదార్పే బెటర్
ఎన్నో ఆశలతో మొదలెట్టిన పాదయాత్ర మధ్యలోనే బ్రేక్ అవ్వడంతో షర్మిల కొంత నిరుత్సాహానికి గురయ్యారని తెలిసింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు కూడా వెలువడ్డాయి. మళ్లీ ఆమె పాదయాత్రను ప్రారంభిస్తుందని అభిమానులు,కార్తకర్తలు అనుకున్నారు. కానీ వారికి షర్మిల ఒక్కసారిగా షాక్ ఇచ్చింది. పాదయాత్ర వద్దని ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయడం లేదని రాష్ట్రంలో తక్కువ వ్యవధిలోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని షర్మిల చెప్పింది. ప్రస్తుతం ఆ రైతు కుటుంబాలను ఓదార్చేందుకు ప్రణాళిక రచించినట్టు తెలిసింది. ఈనెల 19 నుంచి ఓదార్పు యాత్ర ప్రారంభించనున్నట్టు సమాచారం.
Also Read: Chandrababu: ఆ మాజీ న్యాయమూర్తులు జగన్ కు అందుకే సపోర్టు చేశారట.. ఇదేం న్యాయం చంద్రబాబూ?
200 మంది రైతు కుటుంబాలను పరామర్శించాలంటే వచ్చే ఏడాది సగం వరకు ఆమె బిజీగానే ఉంటారు. ఒకవేళ కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లితే షర్మిల మరోసారి రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు టైం ఉండదు. ఓదార్పు యాత్రతోనే జనం అభిమానాన్ని పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒక్కసారిగా ముందస్తు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదలలైతే అటు అధికార ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీని షర్మిల తట్టుకోలేకపోవచ్చును అని తెలుస్తోంది. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వడంతో షర్మిల అభిమానులు కొంత నిరుత్సాహానికి గురయ్యారని తెలిసింది. చూద్దాం ఓదార్పు యాత్ర షర్మిల ఏ మేరకు మేలు చేస్తుందో..
Also Read: KCR: ఎన్నికల మూడ్ లోకి కేసీఆర్ సార్.. అందుకే ఇదంతా?