Homeజాతీయ వార్తలుYS Sharmila: షర్మిల పార్టీ పేరులో మార్పు..? రెండు రాష్ట్రాల్లో కలిసి వచ్చేలా..

YS Sharmila: షర్మిల పార్టీ పేరులో మార్పు..? రెండు రాష్ట్రాల్లో కలిసి వచ్చేలా..

YS Sharmila:దివంగత మాజీ సీఎం వైఎస్ఆర్ తనయ షర్మిల కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ టీపీ పేరిట పార్టీ స్థాపించి తెలంగాణ రాజకీయాల్లోకి ప్రవేశించారు. అయితే, పార్టీకి అనుకున్న స్థాయిలో ఆదరణ లభించడం లేదని వాదనలున్నాయి. కానీ, షర్మిల మాత్రం ప్రతీ రోజు తన కార్యక్రమాలతో ముందుకే వెళ్తోంది. పార్టీ నుంచి నేతలు వీడినిప్పటికీ ఆమె అడుగులు ముందుకు పడుతున్న తరుణంలో తాజాగా షర్మిల పార్టీకి మరో కొత్త కష్టాలు వచ్చాయి.

YS Sharmila
YS Sharmila

షర్మిల పార్టీ పేరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు ఎన్నికల సంఘం చెప్తోంది. వైఎస్ఆర్ అనే పేరు ఉపయోగించుకునే అంశంపై అన్న వైఎస్ఆర్ పార్టీ నుంచి అభ్యంతరాలు వచ్చాయని అందుకే పేరును పూర్తి స్థాయిలో రిజిస్ట్రేషన్ చేయలేదని ఎన్నికల సంఘం పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే వైఎసఆర్ టీపీ పేరుకు బదులుగా ఇతర పేర్లు పెట్టుకోవాలని ఈసీ ప్రతిపాదించినట్లు సమాచారం.

Also Read: బీజేపీయే ‘వాట్సాప్ యూనివర్సిటీ’ సృష్టికర్త.. ‘టెక్ ఫాగ్’తో సోషల్ మీడియాలో కింగ్..?

గతంలో వైఎస్ఆర్‌సీపీ పేరుతో వైఎస్ఆర్ పేరును తొలగించాలని, ఆ పార్టీ పూర్తి పేరు యువజన, శ్రమిక, రైతు కాంగ్రెస్ అనేది వాడుకోవాలని, వైఎస్ఆర్ పేరును వాడుకోవడం వల్ల తన పార్టీకి ఇబ్బందులొస్తున్నాయని అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మహబూబ్ బాషా కంప్లయింట్ చేశారు. తాజాగా షర్మిల పార్టీ పేరుపైనా ఆయనే కంప్లయింట్ చేశాడు. ఈ క్రమంలోనే తన ఫిర్యాదు పరిస్థితి ఏంటని ఆరా తీశారట.

ఈ క్రమంలోనే షర్మిల పార్టీ పేరు ఇంకా రిజిస్టర్ కాలేదని సమాధానం వచ్చిందట. షర్మిల ఇప్పుడు ఏపీ వైపు కూడా చూస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో ఆమె తెలంగాణ అనే పదం వచ్చేలా ఉండటం తీసేసి ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ తన పార్టీ ఉండేలా పేరు మార్చుకోబోతున్నదన్న ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి.. ఏం జరుగుతుందో. ఒక వేళ అదే జరిగితే గతంలో తన అన్న జగన్ కోసం ప్రచారం చేసిన షర్మిల ..ఇక రాజకీయ ప్రత్యర్థిగా ఉండనుంది. తెలంగాణలో ఏ మేరకు ఆమె ప్రభావం చూపుతుందో చూడాలి..

Also Read: జగన్‌ కు చిరంజీవి అంటే ఇష్టం.. నేనే వెళ్ళమన్నాను – నాగార్జున

Mallesh
Malleshhttps://oktelugu.com/
Mallesh is a Political Content Writer Exclusively writes on Telugu Politics. He has very good experience in writing Political News and celebrity updates.
Exit mobile version