https://oktelugu.com/

షర్మిల నోట.. జై తెలంగాణ నినాదం

దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి తనయ వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్ అయింది. ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆ కొత్త పార్టీపైనే ఫోకస్‌ పెట్టాయి. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. షర్మిల వేస్తున్న అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న షర్మిల, రాజన్న రాజ్యం తీసుకురావడానికి పార్టీ పెడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం కోసం వైఎస్సార్‌‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2021 3:49 pm
    Follow us on

    Sharmila says Jai Telangana
    దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖర్‌‌ రెడ్డి తనయ వైఎస్‌ షర్మిల కొత్త పార్టీపై ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో హాట్‌ టాపిక్ అయింది. ఇప్పుడు రాజకీయ వర్గాలు ఆ కొత్త పార్టీపైనే ఫోకస్‌ పెట్టాయి. అంతేకాదు.. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. షర్మిల వేస్తున్న అడుగులను జాగ్రత్తగా గమనిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో కొత్త పార్టీ పెట్టాలని నిర్ణయం తీసుకున్న షర్మిల, రాజన్న రాజ్యం తీసుకురావడానికి పార్టీ పెడతామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టడం కోసం వైఎస్సార్‌‌ అభిమానులతో, నాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో కలిసి పనిచేసిన అధికారులతో, రాజకీయ నాయకులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు.

    Also Read: నష్టపోయాం, మీరే చెప్పారు.. : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

    ఇప్పటికే షర్మిల నల్గొండ జిల్లా నేతలతో మాట్లాడి, అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. నల్గొండ నేతల పూర్తి మద్దతు తనకు ఉందని ఆమె చెప్పుకొచ్చారు. పార్టీ ఏర్పాటుకు ముందే అన్ని జిల్లాల నేతలతో భేటీలు పూర్తిచేయాలని వేగంగా సమావేశాలు నిర్వహిస్తున్న షర్మిల కార్యాచరణలో వేగంగా పావులు కదుపుతున్నారు . ఓవైపు పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడుతూనే, మరోవైపు రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు తెలుసుకోవడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు హైదరాబాద్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన నాయకులు, అభిమానులతో షర్మిల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.

    లోటస్ పాండ్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి దాదాపు ఐదు వందల మందిని ఎంపిక చేశారు. షర్మిల వారితో తన రాజకీయ దృక్పథాన్ని స్పష్టంగా చెప్పారు. ఇదే సమయంలో తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు చేయాల్సినవి చేస్తుందా.. ? టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చిందా..? తెలంగాణలో ఉన్న సమస్యలపై మాట్లాడదామని అభిమానులతో పేర్కొన్న ఆమె 11 ప్రశ్నలతో వారికి ఫీడ్ బ్యాక్ ఫామ్ నింపాలని సూచించారు. అంతేకాదు.. ఈ సమావేశాన్ని ‘జై తెలంగాణ’ అనే నినాదంతో షర్మిల ప్రారంభించడం అందర్నీ ఆకట్టుకుంది.

    Also Read: మోడీ సార్.. పైసా విదిల్చడు.. ప్రసంగాలు చేస్తాడు

    ఆత్మీయ సమావేశాలను పూర్తి చేసిన అనంతరం షర్మిల జిల్లాల పర్యటన చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిల కొత్త పార్టీ ఏర్పాటు, పార్టీ లక్ష్యాలను సమావేశమవుతున్న నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అంతేకాదు తనతో కలిసి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ముందుకు సాగేందుకు వచ్చే నేతల అభిప్రాయాలను, సలహాలను, సూచనలను కూడా తీసుకుంటున్నట్లుగా సమాచారం. అందరి సలహాలు , సూచనలు క్రోడీకరించి ఆమె తగిన నిర్ణయాలు తీసుకుని రాజకీయంగా ముందుకు వెళ్ళే ఆలోచనలో ఉన్నారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్