https://oktelugu.com/

ప‌వ‌న్ – మ‌హేష్‌.. రెమ్యునరేషన్ లో ఎవరు నెంబర్ 1?

‘ఇప్పుడు టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవ‌రు?’ ఈ ప్రశ్నకు.. ప‌్ర‌ధానంగా మ‌హేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్లు మాత్ర‌మే వినిపిస్తాయి. మ‌రి, వీరిద్ద‌రిలోనూ ఎక్కువ‌గా తీసుకునే న‌టుడు ఎవ‌రు? అంటే.. ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతారు. అయితే.. తాజాగా ఈ లెక్క‌ల‌ను క్లియ‌ర్ చేసింది ఓ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక‌. Also Read: ఏపీకి చిరంజీవి.. ఊగిపోతున్న ఫ్యాన్స్ ప‌వ‌ర్ స్టార్‌.. సూప‌ర్ స్టార్‌.. వీళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంద‌రికీ తెలిసిందే. అభిమానుల‌ను వీళ్ల‌ను […]

Written By:
  • Rocky
  • , Updated On : February 20, 2021 / 03:57 PM IST
    Follow us on


    ‘ఇప్పుడు టాలీవుడ్ లో అత్య‌ధిక పారితోషికం తీసుకుంటున్న హీరో ఎవ‌రు?’ ఈ ప్రశ్నకు.. ప‌్ర‌ధానంగా మ‌హేష్, ప‌వ‌న్ క‌ల్యాణ్ పేర్లు మాత్ర‌మే వినిపిస్తాయి. మ‌రి, వీరిద్ద‌రిలోనూ ఎక్కువ‌గా తీసుకునే న‌టుడు ఎవ‌రు? అంటే.. ఎవ‌రి లెక్క‌లు వారు చెబుతారు. అయితే.. తాజాగా ఈ లెక్క‌ల‌ను క్లియ‌ర్ చేసింది ఓ ఇంగ్లీష్ దిన‌ప‌త్రిక‌.

    Also Read: ఏపీకి చిరంజీవి.. ఊగిపోతున్న ఫ్యాన్స్

    ప‌వ‌ర్ స్టార్‌.. సూప‌ర్ స్టార్‌.. వీళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అంద‌రికీ తెలిసిందే. అభిమానుల‌ను వీళ్ల‌ను ఎంత‌గా ఆరాధిస్తారో కూడా చూస్తూనే ఉంటాం. వీళ్ల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ఆ మేనియా మామూలుగా ఉండ‌దు. అందుకే.. వీళ్ల‌కు ఎంత ఇవ్వ‌డానికైనా మేక‌ర్స్ సిద్ధ‌మ‌వుతుంటారు. ప్ర‌స్తుతం అందుతున్న రిపోర్ట్ ప్ర‌కారం.. ప‌వ‌న్ క‌ల్యాణ్ కే రెమ్యూనరేషన్ ఎక్కువ‌గా ఉంద‌ని ప్ర‌ముఖ ఇంగ్లీష్ డైలీ పేప‌ర్ ప్ర‌క‌టించింది.

    ఈ లెక్క ప్ర‌కారం.. పవన్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలు తీసుకుంటున్నాడ‌ట‌. ఈ లెక్క ప్ర‌కారం.. ప‌వ‌న్ కు 200 కోట్ల రూపాయలు అందుతున్నాయి. ప‌వ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు నాలుగు సినిమాల‌ను ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. వ‌కీల్ సాబ్‌, క్రిష్ మూవీ, ఏకే రీమేక్‌, హ‌రీశ్ శంకర్ మూవీ.. ఈ చిత్రాలకు 50 చొప్పున డ‌బుల్ సెంచ‌రీ కొట్టేశాడ‌న్న‌మాట‌. త్వ‌ర‌లో ఐదో చిత్రాన్ని కూడా అనౌన్స్ చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం.

    Also Read: ‘నాంది’ టాక్ అలా.. ‘అల్లరోడి’ ఫీలింగ్ ఇలా..

    అయితే.. పారితోషికం అత్యధికంగా తీసుకోవడమే కాదు.. తనకు వీలు కుదిరిన‌ప్పుడే షూటింగ్ కు వ‌స్తారు ప‌వ‌న్‌. రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌డంతో ఈ ప‌రిస్థితి త‌లెత్తుతోంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయిన‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ తో సినిమాలు చేయ‌డానికి నిర్మాత‌లు క్యూ క‌డుతున్నారు. కొన్ని రోజులు షూటింగ్ లో పాల్గొని, ఆ త‌ర్వాత మరికొన్ని రోజులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు పవన్. ఇలాంటి ప‌రిస్థితుల్లో.. ఒక్కోసారి షూటింగ్ అర్ధంత‌రంగా క్యాన్సిల్ అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయ‌ట‌.

    ఇలా ప‌లు ఇబ్బందులు ఉన్న‌ప్ప‌టికీ.. ప‌వ‌న్ తో సినిమా చేయ‌డానికి ఎగ‌బ‌డుతున్నారు మేక‌ర్స్‌. దీనంత‌టికీ కార‌ణం ఏమంటే.. తెలుగు రాష్ట్రాల్లో ప‌వ‌ర్ స్టార్ కు ఉన్న విస్తృత‌మైన మార్కెట్టే కార‌ణ‌మ‌ని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వ‌చ్చినా.. పెట్టిన సొమ్ము మొత్తం వెన‌క్కి తెచ్చేసుకోవ‌చ్చ‌ని, హిట్ టాక్ వ‌స్తే.. లాభాల పంట పండుతుంద‌ని నిర్మాత‌లు ప‌వ‌న్ తో సినిమాకు ఉవ్విళ్లూరుతున్నారు.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్