https://oktelugu.com/

నష్టపోయాం, మీరే చెప్పారు.. : ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వండి

ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన వర్చువల్‌గా నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ పలు అంశాలను పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని జగన్‌ వ్యాఖ్యానించారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం.. పోలవరం […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 20, 2021 / 03:35 PM IST
    Follow us on


    ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన వర్చువల్‌గా నీతి ఆయోగ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఏపీ సీఎం జగన్ పలు అంశాలను పీఎం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ది ప్రత్యేక హోదాతోనే ముడిపడి ఉందని జగన్‌ వ్యాఖ్యానించారు. విభజన కారణంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదాపై హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ప్రత్యేక హోదా ఇస్తేనే పారిశ్రామిక అభివృద్ధిలో రాష్ట్రంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. విభజన కారణంగా రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్న సీఎం.. పోలవరం సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని.. 13 మెడికల్ కాలేజీలకు అనుమతులు కోరారు.

    Also Read: ప్రతీకారం బిట్టు శ్రీనుదా..? కుంట శ్రీనుదా..? : పాలుపంచుకున్నదెవరు..?

    పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 10 నుంచి 11శాతం వడ్డీలు చెల్లించాల్సి వస్తోందని సీఎం అన్నారు. తయారీ రంగంలో ముందున్న దేశాల్లో వడ్డీ రేట్లు 2 శాతం నుంచి 3 శాతానికి మించడం లేదని గుర్తుచేశారు. రుణాలపై అధిక వడ్డీలు, విద్యుత్ ఖర్చులు భారంగా మారుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో మంచి పనితీరు కనబర్చే పరిశ్రమలకు ప్రభుత్వం ప్రోత్సహకాలు అందిస్తోందన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలు అవసరం ఉందన్నారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించడం, నాణ్యమైన విత్తనాలు అందించడం, సర్టిఫై చేసిన ఎరువులు, పురుగు మందులను అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అలాగే పంటల నిల్వ, గ్రేడింగ్, ప్రాసెసింగ్ కోసం కొత్త టెక్నాలజీని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. రైతులు తమ పంటలను సరైన ధరలకు అమ్ముకునేలా చర్యలు తీసుకోవాలన్నారు.

    Also Read: మళ్లీ కోరలు చాస్తున్న మహమ్మారి

    వీటిపై ప్రధాని మోడీ స్పందిస్తూ.. రాష్ట్రాలన్నీ సమన్వయంతో ముందుకు సాగితేనే సమాఖ్య స్పూర్తికి అర్థమని పేర్కొన్నారు. రాష్ట్రాలతోపాటు జిల్లాల మధ్య కూడా సమాఖ్య స్పూర్తి నెలకొనాలన్నారు. కేంద్ర పథకాలు ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తున్నాయని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలో కోట్లాది మందికి బ్యాంకు ఖాతాలు కల్పించామన్నారు. పేదలకు ఉచిత విద్యుత్, గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. వైద్య, ఆరోగ్య సదుపాయాలను మెరుగుపరిచామని చెప్పారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్