YS Sharmila Arrest: నిరుద్యోగుల సమస్యల పరిష్కారమే ద్యేయంగా వైఎస్ షర్మిల ప్రభుత్వంతో పోరాడుతూనే ఉన్నారు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వంపై పోరాటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు మంగళవారం టీఎస్సీఎస్సీ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిరుద్యోగుల సమస్యలు తీర్చడంలో ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. దీనిపై ప్రత్యక్ష పోరుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి పెద్ద పీట వేయనున్నట్లు చెబుతున్నారు. ప్రతి మంగళవారం వారి కోసం పోరాడేందుకు ముందుకు వస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికే నిర్ణయించుకుంటున్నారు. దీనికి గాను ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదని తెలుస్తోంది.
ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం అని చెప్పిన కేసీఆర్ తరువాత ఆ మాటే మరిచిపోయారు. పైగా తాను అనలేదని బుకాయిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ షర్మిల నిరుద్యోగుల పక్షాన నిలబడేందుకు సమాయత్తమయ్యారు. ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వం ఎందుకు మీనమేషాలు లెక్కిస్తుందో అర్థం కావడం లేదని తెలుస్తోంది.
Also Read: రేపటి నుంచే మేడారం మహాజాతర.. తల్లుల కోసం పోటెత్తిన జనం.. విశేషాలివీ
దీంతో నిరుద్యోగుల కళ్లలో ఆనందం లేకుండా పోతోంది. ఉపాధి కరువై కూడు బరువై నిరుద్యోగుల జీవితాలు అగమ్యగోచరంగా మారుతున్నాయి. దీంతో షర్మిల వారి జీవితాల్లో వెలుగు నింపాలని చూసేందుకు నిర్ణయించుకున్నట్లు భావిస్తున్నారు. షర్మిల నిరుద్యోగుల పాలిట ఆశాదీపంగా మారనున్నారని ఆశిస్తున్నా ప్రభుత్వం ఆమెను అదుపులోకి తీసుకుని ఆందోళన చేయకుండా చేయడం విమర్శలకు తావిస్తోంది.
నిరుద్యోగం రాష్ట్రంలో ఇంకా పెరిగిపోతోంది. అన్ని వైపుల దారులు మూసుకుపోతున్నట్లు కనిపిస్తోంది. దీంతోనే వారికి ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించి ఉద్యోగాల కల్పనకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నారు.
Also Read: చిన్న జీయర్ స్వామికి కేసీఆర్ తో చిక్కులు తప్పవా?