YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రభుత్వం నగదు బదిలీ పథకం ద్వారా ప్రజలను ప్రసన్నం చేసుకుంటోంది. ఒక్కో పథకంతో ప్రజలకు దగ్గరయ్యేందుకు పాట్లు పడుతోంది. అప్పుల కుప్పల్లో కూరుకుపోతోంది. వైసీపీ ప్రభుత్వం రాయితీ పథకాలతో ప్రజలను తమ వైపు తిప్పుకుంటోంది. దీన్ని టీడీపీతోపాటు టీవీ చానళ్లు కూడా తప్పు పడుతున్నాయి. ప్రభుత్వం పక్కా ప్రణాళితో ముందుకు వెళుతున్నా ప్రతిపక్షాలు మాత్రం గోల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్పో సప్పో చేసి నెట్టుకొస్తుంటే ప్రతిపక్షాల గోలతో ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
గత ప్రభుత్వ తీరుతో ప్రజలు విసిగి వేసారిపోయారు. లేనిది ఉన్నట్లు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించిందని వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు. పరిశ్రమలు, సంస్థలు ఏపీకి వచ్చిన దాఖలాలు లేకున్నా వాటిని తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకుంటూ పబ్బం గడిపిన టీడీపీ విధానాలను ఎండగడుతోంది. ప్రజలను మభ్యపెట్టే పనులు చేస్తూ అసలు పనులు పక్కన పెట్టిన టీడీపీ ఇప్పుడు నోరు పారేసుకుంటోందని దుయ్యబడుతున్నారు. జగన్ (Jagan) తీరుతో రాష్ర్టం మొత్తం సుభిక్షంగా ఉందని వైసీపీ నేతల ఆశాభావం.
ప్రస్తుతం ఏపీ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో పరిశ్రమలు వచ్చే సూచనలు కనిపించడం లేదు. వాటికి సరైన విధంగా ఇన్సెంటివ్ ఇస్తేనే రాష్ర్టంలో స్థాపించడానికి ముందుకు వస్తాయని తెలియడంతో ప్రభుత్వం వాటి గురించి అంతగా పట్టించుకోవడం లేదు. దీంతో అవి పక్క ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. దీంతో ప్రతిపక్షాలు గొడవ చేస్తున్నాయి. రాష్ర్ట ఖజానా దిగజారిపోతోందని దుయ్యబడుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం వీలైనన్ని అప్పులు తెస్తూ ప్రజల జేబులు నింపడానికే ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రతిపక్షాల గోల కూడా నిజమే అనిపిస్తోందని పలువురు ప్రజాస్వామ్యవాదాలు చెబుతున్నారు.
రాష్ర్ట పరిస్థితి మరింత దిజారిపోతోందని టీడీపీ స్పందిస్తోంది. మొత్తం రుణమయంగా మారిపోతోందని ఎద్దేవా చేస్తోంది. రాబోయే ప్రభుత్వానికి చిక్కుల తప్పవని చెబుతోంది. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ లో అప్పు పుట్టడం కూడా గగనమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ఆర్థిక పరిస్థితిపై పార్టీలు కూడా బెదిరిపోతున్నా ప్రభుత్వం మాత్రం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారిస్తున్నట్లు సమచారం. అప్పులు తెచ్చుకుని మరీ తమ ప్రభుత్వం మనుగడ సాధిస్తుందని చెబుతున్నారు.