
Income Tax Recruitment 2021: ఆదాయపు పన్ను శాఖ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. ఉత్తర ప్రదేశ్ (ఈస్ట్) డివిజన్ లో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి ఈ సంస్థ సిద్ధమైంది. పదో తరగతి, డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫుల్ టైమ్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్ ద్వారా మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, ట్యాక్స్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
సైక్లింగ్, కబడ్డీ, హాకీ, కరాటే క్రీడలతో పాటు బాస్కెట్‌బాల్, బాక్సింగ్, బాడీ బిల్డింగ్, చెస్, క్రికెట్, ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్ క్రీడల్లో రాణించిన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని చెప్పవచ్చు. ఆఫ్ లైన్ పద్ధతిలో ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 30వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://incometaxindia.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
మొత్తం 28 ఉద్యోగ ఖాళీలలో ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలు 13, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలు 12, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉద్యోగ ఖాళీలు 3 ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ ఉద్యోగ ఖాళీలకు ఎంపికయ్యే వాళ్లు గంటకు 8,000 పదాలను డేటా ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగ ఖాళీలకు మాత్రం పదో తరగతి పాసై ఉండాలి. ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఉద్యోగ ఖాళీలకు డిగ్రీ పాసైన వాళ్లు దరఖాస్తు చేసుకోవచ్చు.
18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 56,900 రూపాయల నుంచి 1,42,400 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు యూపీలోని లక్నో అడ్రస్ కు దరఖాస్తులను పంపాల్సి ఉంటుంది.