విపక్షాల్లో ఐక్యత కనిపిస్తోంది. మరోవైపు ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఈ తరుణంలో వైసిపి కలవరపాటుకు గురవుతోంది.అందుకే గెలుపు గుర్రాలను రంగంలోకి దించాలని భావిస్తోంది.
రాష్ట్రంలో గత 30 సంవత్సరాలుగా ఎన్నో విపత్తులు విధ్వంసాన్ని సృష్టించాయి. తితలి, హుద్ హుద్, లెనిన్, తాజాగా మిచాంగ్ తుఫాన్లు కాకావికలం చేశాయి. అయితే సీఎం గా చంద్రబాబు ఉన్న సమయంలో ఎన్నో రకాలుగా విపత్తులు వచ్చాయి.
తుఫాను బాధితులకు అందించే సాయాన్ని సీఎం జగన్ ప్రకటించారు. కేజీ ఆనియన్, కేజీ ఉల్లిగడ్డ అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని నిర్వీర్యం చేసిన సంగతి తెలిసిందే. మూడు రాజధానుల ప్రకటనతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమికి ప్రధాన కారణం ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకత. దీనిని అప్పట్లో చంద్రబాబు లైట్ తీసుకున్నారు. తనపై నమ్మకంతో ప్రజలు గెలిపిస్తారని విశ్వసించారు.
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. మూడోసారి అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టాలన్న కెసిఆర్ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు తిరస్కరించారు. కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు.
గత ఎన్నికల్లో జగన్, కెసిఆర్ పరస్పరం సహకారమందించుకున్నారు. ఏపీలో వైసీపీకి ప్రత్యర్థైన తెలుగుదేశం పార్టీ 2018లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. దీంతో జగన్ కేసీఆర్ కు దగ్గరయ్యారు.
సాధారణంగా గిరిజనులు అల్పసంతోషులు అంటారు. వారు ఏమీ భారీగా అడగరు. ఇవ్వలేదని ఏనాడు ఆందోళన చేయరు. అయితే తాము పండించిన పంటలు, అటవీ ఉత్పత్తులను విక్రయించుకోవడానికి, అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులు వెళ్లడానికి దారి కావాలని కోరుకున్నారు.
అవశేష ఆంధ్రప్రదేశ్ కు తొలి సీఎంగా చంద్రబాబు వ్యవహరించారు. ఆ సమయంలో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయా? అంటే సమాధానం లేదు. ఎద్దు ఈనిందంటే దూడను శాలలో కట్టేయండి అన్నట్టు ఉంది అప్పటి పరిస్థితి.
బిజెపితో తెలుగుదేశం పార్టీది విడదీయరాని బంధం. భారతీయ జన సంఘం నుంచి బిజెపి ఆవిర్భవించగా.. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది.