YouTuber Nick Yardy: సోషల్ మీడియా వినియోగం పెరిగిన తర్వాత చాలామంది ఇన్ ప్లూయన్సర్ ల అవతారం ఎత్తుతున్నారు. అందులో నిక్ యార్డి కూడా ఒకడు. అమెరికాలో ఉంటున్న ఇతడు సోషల్ మీడియాలో ఇన్ ఫ్లూ యన్సర్ గా కొనసాగుతున్నాడు. ఇన్ స్టా గ్రామ్ లో ఇతడిని 6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
కొత్త కొత్త పోస్టులు పెట్టడం.. సరికొత్త వీడియోలు రూపొందించడంలో నిక్ యార్డికి మంచి పట్టు ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళతో కలిసి అతడు చేసే రొమాంటిక్ పనులు భలే ఉంటాయి. వాటిని వీడియోలుగా తీసి.. తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేస్తూ ఉంటాడు. ఏ విషయాన్నయినా సరే కుండబద్దలు కొట్టే విధంగా చెప్పడంలో నిక్ యార్డి ముందు వరుసలో ఉంటాడు. అందువల్లే అతడిని అమెరికన్ ప్రజలు మాత్రమే కాకుండా, ఇతర దేశాల ప్రజలు కూడా అనుసరిస్తుంటారు.. సోషల్ మీడియాలో ప్రాచుర్యం పొందిన వ్యక్తి కావడంతో అతడికి అమెరికన్ మీడియా ప్రముఖ ప్రాధాన్యమిస్తుంది. ఇక ఇటీవలి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎందుకు గెలవాలో నిక్ యార్డి సోదాహరణంగా వివరించాడు. అప్పట్లో అది సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.నిక్ యార్డి మాటలకు యువత మొత్తం ఫిదా అయిపోయారు. అందువల్లే వారు ట్రంప్ అభ్యర్థిత్వాన్ని బలపరిచారు.
ఒకేసారి గర్భవతులను చేశా
నిక్ యార్డి పేరుపొందిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్. అతడికి ఇన్ స్టా గ్రామ్ లో ఆరు మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. అతడికి ఆదాయం కూడా భారీగానే వస్తోంది. ఈ క్రమంలో అతడు జాడే టీన్ అనే మహిళతో పీకల్లోతు ప్రేమలో ఉన్నాడు. వారిద్దరూ సహజీవనం కూడా చేస్తున్నారు. అమెరికాలో ఇలాంటి సంస్కృతి సర్వసాధారణం. అయితే నిక్ యార్డి తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశాడు. అందులో తన స్నేహితురాలు జాడే టీన్ ఉంది. మరో మహిళ కూడా ఆ వీడియోలో కనిపించింది. అయితే వారిద్దరూ గర్భవతులుగా ఉన్నారు. వారిద్దరని నిక్ యార్డి చూపించుకుంటూ ఆనందపడిపోయాడు. నిక్ యార్డి కుడివైపున ఉన్న యువతి పేరు జాడే టీన్. ఆమె అతడి స్నేహితురాలు.. ఎడమవైపున ఉన్న మహిళ జాడే టీన్ మాతృమూర్తి. అయితే వారిద్దరిని ఒకేసారి గర్భవతులను చేశానని నిక్ యార్డి ఆ వీడియోలో వ్యాఖ్యానించాడు. దీనిపై నెటి జన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిక్ యార్డి ఒకసారిగా నాలుక కరుచుకున్నాడు. ఆ తర్వాత ఇదంతా ఫేక్ అని.. వినోదం కోసం ఇలా చేయాల్సి వచ్చిందని కవరింగ్ ఇచ్చాడు. దీనిపై నెటిజన్లు మరింత మండిపడ్డారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండి ఇలాంటి దిక్కుమాలిన పనులు చేస్తావా అంటూ అతడిని కడిగి పారేశారు. అయినప్పటికీ అతడు తన బుద్ధిని మానుకోలేదు. అలాంటి వెకిలి వీడియోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పోస్ట్ చేయడం ఆపలేదు.