అన్నకు మాట్లాడి తమ్ముడితో చేయించారని సూసైడ్

పెద్దలు చేసిన పనికి వధువు బలి అయింది. అన్నతో నిశ్చితార్థం అయ్యాక తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడంతో తట్టుకోలేక తనువు చాలించింది. 28 రోజుల క్రితం జరిగిన వివాహంతో రెండు కుటుంబాల్లో వేడుకలు జరిగినా ఆమె మాత్రం తన మనసులో అలజడి పెంచుకుంది. ఇక మా బాధ్యత అయిపోయిందని ఇరు వైపుల తల్లిదండ్రులు భావించినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోలేక నవ వధువు తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. వివరాల్లోకి వెళితే.. బాలాపూర్ […]

Written By: Srinivas, Updated On : August 9, 2021 11:54 am
Follow us on

పెద్దలు చేసిన పనికి వధువు బలి అయింది. అన్నతో నిశ్చితార్థం అయ్యాక తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయడంతో తట్టుకోలేక తనువు చాలించింది. 28 రోజుల క్రితం జరిగిన వివాహంతో రెండు కుటుంబాల్లో వేడుకలు జరిగినా ఆమె మాత్రం తన మనసులో అలజడి పెంచుకుంది. ఇక మా బాధ్యత అయిపోయిందని ఇరు వైపుల తల్లిదండ్రులు భావించినా ఫలితం మాత్రం దక్కలేదు. దీంతో తన బాధను ఎవరికి చెప్పుకోలేక నవ వధువు తన ప్రాణాన్ని విడిచిపెట్టింది. వివరాల్లోకి వెళితే..

బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతబస్తీ వట్టెపల్లి కి చెందిన షబ్బీర్ అలీ కుమార్తె షాహిబేగం(25) జల్ పల్లి న్యూబాబానగర్ వాసి మీర్ ఇస్మాయిల్ ఉద్దీన్ అలీకి 28 రోజుల క్రితం పెళ్లి చేశారు. అయితే మూడేళ్ల క్రితమే ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ అన్నయ్యతో ఆమెకు నిశ్చితార్థమైంది. అనంతరం అన్నదమ్ములిద్దరు ఉపాధి నిమిత్తం ముంబయి వెళ్లారు. కరోనా నేపథ్యంలో అతడు ఇంటికి తిరిగి రాలేదు. కానీ నెలన్నర క్రితం తమ్ముడు ఇస్మాయిల్ ఉద్దీన్ అలీ వచ్చాడు.

పెద్ద కుమారుడు ఆచూకీ లేకపోవడంతో రెండు కుటుంబాల పెద్దలు చర్చించి షాహిన్ బేగంను ఇస్మాయిల్ కు ఇచ్చి జులై 12న వివాహం చేశారు. సోదరుడికి నిశ్చితార్థమైన అమ్మాయితో తనకు వివాహం చేశారంటూ అలీ తీవ్రంగా మదనపడేవాడు. భార్యగా అంగీకరించలేనని చెప్పేవాడు. దీంతో ఆమె మానసికంగా కుంగిపోయింది. దీనికి తోడు అత్తమామల కట్నం కోసం వేధింపులు ఎక్కువయ్యాయి.

దీంతో కలత చెందిన షాహిన్ బేగం శనివారం తన గదిలో ఫ్యాన్ కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే ఆమె మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. పిల్లల మనోభావాలు తెలుసుకోకుండా ఇలా పెళ్లి చేయడం వల్ల ఓ నిండు ప్రాణం పోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు తెలిసే సూచనలు కనిపిస్తున్నాయి.