
తెలంగాన హైకోర్టు న్యాయమూర్తి కేశవరావు సోమవారం తెల్లవారు జామున కన్నుమూశారు. అనారోగ్యంతో నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కేశవరావు మృతితో తెలంగాణ వ్యాప్తంగా కోర్టులకు హైకోర్టు రిజిస్టర్ జనరల్ సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీ హిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు.