Girl Missing: ఆడపిల్లలపై ఆకృత్యాలు పెరుగుతున్నాయి. తెల్లవారితే చాలు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని తల్లిదండ్రులు బెంగతో ఉంటున్నారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆడపిల్ల మళ్లీ ఇల్లు చేరే వరకు తల్లిదండ్రులకు ఒకటే దడ. తమ కూతురు సురక్షితంగా వస్తుందా? లేదా? అనే అనుమానాలు వస్తున్నాయి. పరిస్థితులు అలా తయారయ్యాయి. ఎవరిని నమ్మే వీలు లేకుండా పోయింది. ఎదిగిన ఆడపిల్లలపైనే నిఘా అంతా. వారు ఎటు వెళ్తుతన్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలపై ఎవరి కన్ను పడకుండా ఉండాలని తల్లిదండ్రులు దేవుళ్లను ప్రార్థించే రోజులు రావడం గమనార్హం.
సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చంపాపేట గాంధీ విగ్రహం కుమ్మరి బస్తీ ప్రాంతానికి చెందిన మౌనిక (22) ప్రైవేటుగా ఉద్యోగం చేస్తోంది. విధి నిర్వహణలో భాగంగా రోజూ కార్యాలయానికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేది. కానీ డిసెంబర్ 2న మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన మౌనిక తిరిగి ఇల్లు చేరలేదు. దీంతో తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది. తమ కూతురు ఏమైందనే దానిపై కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బంధువులు, స్నేహితులు, తెలిసిన వారి ఇళ్లలో వెతికినా లాభం లేదు. అమ్మాయి ఆచూకీ కానరావడం లేదు. దీంతో తల్లిదండ్రుల్లో గుండెదడ పెరుగుతోంది. ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని రోదిస్తున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురుకు ఏమైందనే అనుమానం పెరుగుతోంది. రోజు సమయానికి వచ్చే అమ్మాయి నాలుగైదు రోజులుగా ఇంటికి రాకపోవడంపై అందరిలో ఒకటే ఉత్కంఠ కలుగుతోంది.
Also Read: KCR vs MODI: కేసీఆర్ కు చుక్కలు చూపిన మోడీ సర్కార్?
పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా దర్యాప్తు ముమ్మరం చేశారు. సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. ఎక్కడ అదృశ్యమైందనే విషయంపై ఆరా తీస్తున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకుంటున్నారు. అమ్మాయి వెళ్లిన దారులను తనిఖీ చేస్తున్నారు. దీంతో అమ్మాయి అదృశ్యం ఆ ప్రాంతంలో సంచలనం సృష్టిస్తోంది. అమ్మాయికి ఏం జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.
Also Read: KCR Politics: వచ్చేసారి గెలుపు కోసం కేసీఆర్ కఠిన నిర్ణయం.. ?