https://oktelugu.com/

Akhanda Collections: ‘అఖండ’ ఊచకోత.. నాలుగురోజుల కలెక్షన్స్ ఎంతంటే?

Akhanda Collections: నందమూరి బాలకృష్ణ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అభిమానుల్లో ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలారోజుల తర్వాత ఇండస్ట్రీకి ‘అఖండ’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ టాలీవుడ్ పెద్దలు సైతం ఖుషీ అవుతున్నారు. బోయపాటి-నందమూరి కాంబినేషన్ మరోసారి హిట్ కావడంతో టాలీవుడ్లో ‘అఖండ’ మూవీ సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ లో వకీల్ సాబ్ కలెక్షన్లను వెనక్కినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ‘అఖండ’ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 7, 2021 11:26 am
    Follow us on

    Akhanda Collections: నందమూరి బాలకృష్ణ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అభిమానుల్లో ఆ సందడి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలారోజుల తర్వాత ఇండస్ట్రీకి ‘అఖండ’ రూపంలో బ్లాక్ బస్టర్ హిట్ టాలీవుడ్ పెద్దలు సైతం ఖుషీ అవుతున్నారు. బోయపాటి-నందమూరి కాంబినేషన్ మరోసారి హిట్ కావడంతో టాలీవుడ్లో ‘అఖండ’ మూవీ సరికొత్త రికార్డులను సెట్ చేస్తోంది. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ లో వకీల్ సాబ్ కలెక్షన్లను వెనక్కినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

    Akhanda Collections

    Akhanda Collections

    ‘అఖండ’ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.53 కోట్ల మేరకు జరిగింది. బాలయ్య కెరీర్లో రెండో అత్యధిక బిజినెస్ ‘అఖండ’కే జరిగింది. బాలయ్య-బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ సినిమాకు భారీ స్థాయిలో రిలీజుకు ముందే బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ మూవీ డిసెంబర్ 2న రిలీజు కాగా విడుదలైన అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తో మంచి కలెక్షన్లు రాబడుతుండటంతో చిత్రయూనిట్ ఖుషీ అవుతోంది.

    ‘అఖండ’ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో నాలుగో రోజు కలెక్షన్లు భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. నైజాంలో 2.95 కోట్లు.. సీడెడ్లో 2.03 కోట్లు, ఉత్తరాంధ్రలో 87 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 57లక్షలు, వెస్ట్ గోదావరిలో 42 లక్షలు, గుంటూరులో 55లక్షలు, కృష్ణాలో 62లక్షలు, నెల్లూరులో 30 లక్షలు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిపి రూ. 8.31 కోట్లు షేర్, రూ. 13.80 కోట్లు గ్రాస్ ను ‘అఖండ’ చిత్రం రాబట్టింది.

    మొత్తంగా నాలుగు రోజులకు కలిసి చూస్తే.. నైజాంలో 12.11 కోట్లు, సీడెడ్‌లో 9.81కోట్లు, ఉత్తరాంధ్రలో 3.74 కోట్లు, ఈస్ట్ గోదావరిలో 2.61 కోట్లు, వెస్ట్ గోదావరిలో 2.04 కోట్లు, గుంటూరులో 3.26 కోట్లు, కృష్ణాలో 2.28 కోట్లు, నెల్లూరులో 1.71 కోట్లు వచ్చాయి. రెండు రాష్ట్రాల్లో కలిసి రూ. 37.56 కోట్లు షేర్, రూ. 59.10 కోట్లు గ్రాస్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో 3.25 కోట్లు, ఓవర్సీస్‌లో 4.05 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. తద్వారా ప్రపంచ వ్యాప్తంగా ‘అఖండ’ మూవీ 44.86 కోట్లు షేర్, 73.60 కోట్ల గ్రాస్ రాబట్టిందని సమాచారం.

    Also Read: అది అసలు సమస్యే కాదు… అఖండ తో బాలయ్య నిరూపించాడుగా

    ఈ మూవీ రిలీజుకు ముందే రూ. 53 కోట్ల మేర బిజినెస్ చేయగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 54 కోట్లుగా నమోదయింది. నాలుగు రోజుల్లోనే ఈ మూవీ 44.86 కోట్ల మేర వసూలు చేయడంతో మరో 9.14 కోట్లు కలెక్షన్లు వస్తే ‘అఖండ’ హిట్ స్టేటస్‌ను అందుకోవడం ఖాయంగా కన్పిస్తోంది. దీంతో కరోనా టైంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ‘అఖండ’ రికార్డు సృష్టిస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.

    ఇక ఓవర్సీస్ లో నాలుగు రోజుల్లో వకీల్ సాబ్ 743కే డాలర్లు రాగా  ‘అఖండ’ మూడు రోజుల్లో 800కే డాలర్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో ఓవర్సీస్ లో ‘వకీల్ సాబ్’ రికార్డును ‘అఖండ’ బ్రేక్ చేసినట్లయింది. ఇక వరుసగా నాలుగో రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన (నాన్ బాహుబలి)’ చిత్రాల్లో ‘అఖండ’ ఐదో మూవీగా నిలిచింది. మొత్తంగా బాలయ్య ‘అఖండ’ కలెక్షన్ల సునామీతో ఊచకోత కోస్తుండటంతో నందమూరి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

    Also Read: ‘అఖండ’ విజయోత్సాహంతో బాలయ్యకు దిల్​రాజు ట్రీట్​