https://oktelugu.com/

Teenmaar Mallanna Arrested: పాదయాత్రకు ముందు తీన్మార్ మల్లన్నకు గట్టి షాక్

Teenmaar Mallanna Arrested: సోషల్ మీడియా ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను తెలంగాణ ప్రభుత్వం వేటాడుతోంది. సోసల్ మీడియాలో కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న ఈయనపై వరుసగా కేసులు, అరెస్ట్ లు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని చిలకలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత […]

Written By: , Updated On : August 28, 2021 / 11:01 AM IST
Follow us on

Teenmaar Mallanna Arrested

Teenmaar Mallanna Arrested: సోషల్ మీడియా ఉద్యమకారుడు, ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నను తెలంగాణ ప్రభుత్వం వేటాడుతోంది. సోసల్ మీడియాలో కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరుగుతున్న ఈయనపై వరుసగా కేసులు, అరెస్ట్ లు చేస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా మరో కేసులో తీన్మార్ మల్లన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని చిలకలగూడలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేయడంతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలపై మల్లన్నను అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఇక మల్లన్నను అరెస్ట్ చేయడంపై ఆయన మద్దతుదారులు తీవ్రంగా ఖండిస్తున్నారు. పోలీసులు మాత్రం తాము చట్ట ప్రకారమే అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారు. మల్లన్నకు మద్దతుగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్, బీజేపీ కార్యకర్తలు అండగా నిలుస్తున్నారు. మొన్న క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు చేస్తే అడ్డుకున్నారు.

యూట్యూబ్ లో తీన్మార్ మల్లన్న(Teenmaar Mallanna) ప్రస్తుతం ‘క్యూ’ న్యూస్ చానెల్ ను నిర్వహిస్తున్నాడు. అందులో కొద్దిరోజుల పాటు లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడిపై వరుస కథనాలు ప్రసారం చేశారు. జ్యోతిష్యం పేరుతో లక్ష్మీకాంత శర్మ చాలా మందిని మోసం చేశారని అందులో ఆరోపించారు. బాధితులుగా చెబుతున్న కొంతమందితో చానెల్ లో మాట్లాడించారు. ఇదే క్రమంలో లక్ష్మీకాంత వర్మ ఇటీవల మల్లన్నపై చిలకలగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30 లక్షలు డిమాండ్ చేశారని.. కొందరు నకిలీ భక్తులను తన వద్దకు పంపి ఇబ్బంది పెడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. డబ్బులు ఇచ్చేందుకు తాను నిరాకరించడంతో ఇలా తనపై తప్పుడు కథనాలు ప్రసారం చేశాడని జ్యోతిష్యుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

ఇవేకాదు.. ఇదివరకే టీఆర్ఎస్ కార్యకర్తల ఫిర్యాదు మేరకు తీన్మార్ మల్లన్నపై చిలకలగూడ, సైబర్ క్రైమ్, చిక్కడపల్లి, జూబ్లిహిల్స్ పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు కేసులు నమోదయ్యాయి. గత కొద్దిరోజులుగా తీన్మార్ మల్లన్న ఏదో ఒక కేసులో తరచూ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

తీన్మార్ మల్లన్న ఈనెల 29 నుంచి పాదయాత్రకు ప్లాన్ చేశారు. ఆలంపూర్ నుంచి ప్రారంభించాల్సిన ఈ పాదయాత్రను అనూహ్యంగా హుజూరాబాద్ కు మార్చారు. ఈ క్రమంలోనే పాదయాత్రకు ఒక రోజు ముందు మల్లన్నను అరెస్ట్ చేయడంపై ఆయన మద్దతుదారులు మండిపడుతున్నారు. పాదయాత్రను అడ్డుకునేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.