మరీ వర్మ అదే మన కర్మ ఎందుకు ఇలా అయిపోతున్నాడు ? చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అని ఒక సామెత ఉంది. ఇప్పుడు వర్మ ఆ సామెతకు పర్ఫెక్ట్ గా సరిపోతాడు అనిపిస్తుంది. వర్మ తన గురించి చెప్పే మాటలు కూడా పూర్తి ఇబ్బంది కరంగా ఉంటాయి. అమితాబ్ తల్లిగారు చనిపోయినప్పుడు వర్మ అమితాబ్ వద్దకు వెళ్ళాడట.
ఈయన గారు వెళ్ళి అమితాబ్ కి ఓ వండర్ ఫుల్ జోక్ చెప్పేసి అమితాబ్ లో ఇక ఇకలు పక పకలు పుట్టించాడట. వర్మ ఎప్పుడు చెప్పే మరో వింత ఏమిటంటే… తన కూతురు గురించి తనకేం తెలియదని. జంతువులు కూడా తమ సంతానం గురించి ఆలోచిస్తాయి. మరి వర్మ జంతువు కంటే హీనుడా ? అని అనలేం.
ఎందుకంటే.. ఆర్జీవీ అంటేనే ప్రత్యేక జీవి. ఈ జీవి చెప్పిన మరో బోల్డ్ మాట.. ‘పొద్దున లేచి నేను ఆ వీడియోలు చూస్తాను, నిత్యం వోడ్కా తాగుతాను’ అంటూ చివరకు ‘నా చావు నేను చస్తాను’ అని ఒక ఉన్మాది మాదిరిగా వర్మ రోజురోజుకు రెచ్చిపోతుంటే.. ఆయన అభిమానులు మాత్రం కుమిలిపోతున్నారు.
ఇకనైనా వర్మ మారాలని ఆశిద్దాం. మారకపోతే, చెట్టు చెడే కాలానికి కుక్కమూతి పిందెలు పుడతాయి అని సామెతను గుర్తుకు తెచ్చుకుని పక్కన పెట్టేద్దాం. ఏది ఏమైనా వివాదాల వర్మ చివరికి మనకు అవరోధాల కర్మ అయిపోయాడు.