https://oktelugu.com/

యస్‌ బ్యాంక్‌ సంక్షోభంలో అనిల్ అంబానీకి ఈడీ షాక్

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా దూకుడుగా కనిపించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ వలెనే కేసీఆర్, ఎంఐఎం లపైననే గురి పెట్టారు. పైగా వాళ్ళను తుక్డేగాళ్ళంటూ వారి సంగతేదో తెలుస్తా అని సంబధం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఇక చరమగీతం పాడిన్నట్లే అంటూ భరోసా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్న్యాయం బీజేపీయే […]

Written By:
  • Neelambaram
  • , Updated On : March 16, 2020 2:53 pm
    Follow us on

    బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ తొలిసారి హైదరాబాద్ లోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలోకి అడుగు పెట్టినప్పుడు చాలా దూకుడుగా కనిపించారు. గతంలో అధ్యక్షులుగా పనిచేసిన జి కిషన్ రెడ్డి, డా కె లక్ష్మణ్ వలెనే కేసీఆర్, ఎంఐఎం లపైననే గురి పెట్టారు. పైగా వాళ్ళను తుక్డేగాళ్ళంటూ వారి సంగతేదో తెలుస్తా అని సంబధం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ పాలనకు ఇక చరమగీతం పాడిన్నట్లే అంటూ భరోసా వ్యక్తం చేశారు.

    తెలంగాణలో కేసీఆర్ కు ప్రత్యామ్న్యాయం బీజేపీయే అంటూ ఇతర పార్టీ నాయకుల వలే పాట పాడారు. అయితే మునిసిపల్ ఎన్నికల సందర్భంగా భైంసాలో అల్లర్ల పట్ల ఒక విధంగా కిషన్ రెడ్డి, లక్ష్మణ్ మాటలకు పరిమితమై బాధితులకు అండగా నిలబడలేదన్న అంశాన్ని పరోక్షంగా ప్రస్తావించారు.

    అల్లర్లు సృష్టించిన తుక్డేగాళ్ల సంగతేంటో తేలుస్తానని అంటూ పసిపిల్లల్ని చేతిలో పట్టుకుని తమపై పెట్రోల్ పోసి చంపేస్తున్నారంటూ ఆడపడుచులు ఆర్తనాదాలు చేసే పరిస్థితి అక్కడ తలెత్తిందని ఆందోళన వ్యక్తం చేశారు. వాళ్లందరినీ పరామర్శించేందుకు భైంసా వస్తానని చెప్పారు.

    ఆ అల్లర్లలో నిలువ నీడ లేకుండా పోయి చెట్ల కింద బతుకుతున్న నిరుపేదల్ని, అక్రమ కేసులతో జైళ్లలో పెట్టిన తమ్ముళ్లను కలిసి అండగా ఉంటామని భరోసా ఇస్తానని తెలిపారు.  భరోసా బాధితులకు గతంలో ప్రకటించిన రూ 5 లక్షల విరాళాన్ని ఈ సందర్భంగా నిజామాబాదు ఎంపీ డి అరవింద్ సంజయ్ కు అందజేయడం ద్వారా తెలంగాణలో బిజెపికి నూతన వైభవం తీసుకు రావడంతో తాము తోడు, నీడగా ఉంటామనే సంకేతం ఇచ్చారు.

    ఒక విధంగా నిన్న, మొన్నటి వరకు కరీంనగర్ నగరానికి పరిమితమైన నాయకుడు, గత ఏడాది లోక్ సభకు ఎన్నిక కావడం, ఇప్పుడు ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కావడం ఇతర సీనియర్ నేతలకు మింగుడు పడటం లేదని కలవికాలంగా కనిపించిన వారి ముఖాలే స్పష్టం చేస్తున్నాయి. జాతీయ వాదమే ఊపిరిగా బీజేపీలో సామాన్య కార్యకర్తగా పని చేస్తున్న తనకు రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించడం పార్టీ గొప్పదనమని, ప్రతి కార్యకర్తకు దక్కిన గౌరవమని చెప్పడం ద్వారా పార్టీలో కార్యకర్తలకు గౌరవం కలిగిస్తామని సంకేతం ఇచ్చారు.

    అయితే ప్రజలలో ఎటువంటి పలుకుబడి లేకుండా, పార్టీ రాష్త్ర అధ్యక్షుల చుట్టూ తిరుగుతూ గతం దశాబ్ద కాలంగా కీలక పదవులను కైవసం చేసుకొంటున్న వారే ఎక్కువగా వేదిక అంత అనింది ఉండడం జరిగింది. సంస్థాగతంగా బలంగా ఉండడంతో పాటు నాయకత్వ లోటు ఎదుర్కొంటున్న పార్టీని రాష్ట్రంలో ఏ విధంగా గాడిలో పెట్టదలిచానో అనే అంశంపై ఎటువంటి సంకేతాలు ఇవ్వలేదు.

    అదే విధంగా రాష్ట్రంలో పార్టీకి వైభవం తీసుకు రావడానికి కూడా తన ముందున్న ఎజెండాను సహితం సూచించే ప్రయత్నం చేయలేదు. సంస్థాగతంగా రాష్ట్రంలో పార్టీకి భారీ శస్త్ర చికిత్స చేయవలసి ఉంది. అందుకు ఆయనకు స్వతంత్రం లభిస్తుందా? అలంకారపు బొమ్మగా మిగిలిపోతారా అన్నది ముందు, ముందు గాని తెలియదు.