జగన్ పై జేసీ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. ప్రతిపక్షం అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు. ఒకవైపు జగన్‌ ని పొగుడుతూనే మరోవైపు ప్రభుత్వ పని తీరుపై జేసీ […]

Written By: Neelambaram, Updated On : March 16, 2020 3:34 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా తెలివైన వ్యక్తని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేష్ కుమార్ ను కలిసేందుకు ఎన్నికల సంఘం కార్యాలయానికి వచ్చిన జేసీ మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ చాలా తెలివైనవారని.. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ తగ్గిందని.. ప్రతిపక్షం అయినంత మాత్రాన అన్నీ విమర్శించాలని లేదన్నారు.

ఒకవైపు జగన్‌ ని పొగుడుతూనే మరోవైపు ప్రభుత్వ పని తీరుపై జేసీ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఈసీ, గవర్నర్ ఎవరూ ఉండకూడదని, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులుగా ఒక్కరే ఉండి.. పోలీసులు ఉంటే సరిపోతుందంటూ జగన్ తీరును జేసీ ఎండగట్టారు. రాష్ట్రంలో ఓ భస్మాసురుడు ఉన్నాడని, తన నెత్తిమీద తానే చేయి పెట్టుకుంటున్నాడని, ఆ భస్మాసురుడు ఎవరో ప్రజలకు తెలుసని జేసీ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో పోలీసుల పనితీరు బాగోలేదని, వారు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని కాబట్టి ప్రతి పోలింగ్ బూత్‌ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు జేసీ తెలిపారు. అందుకే రమేష్‌ కుమార్‌ ను కలిశానని.. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ఎన్నికల సంఘం దగ్గర డబ్బులు లేకపోతే తమ పార్టీ దగ్గర డబ్బులు ఉన్నాయి.. ఇస్తామన్నారు. ఇక కోర్టులు ఎన్నికల విషయంలో జోక్యం చేసుకోవని జేసీ వ్యాఖ్యానించారు.