
BJP Vs BRS : తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య పసుపు పంచాయతీ మళ్లీ మొదలైంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బసుపు బోర్డే బీఆర్‌ఎస్ అభ్యర్థి, ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత ఓటమికి కారణమైంది. బీజేపీ అభ్యర్థి ఆర్వింద్‌ను భారీ మెజారిటీతో గెలిపించింది. ఈ ఎన్నిల ప్రచారంలో భాగంగా అర్వింద్ గెలిచిన ఐదు రోజుల్లో పసుపు బోర్డు తెస్తానని హామీ ఇచ్చారు. బాండ్ పేపర్ కూడా రాసిచ్చాడు. ఐదు రోజులు కాదు కదా ఐదు నెలలు గడిచిపోయింది. ఐదేళ్లు కావొస్తోంది. కానీ పసుపు బోర్డు మాత్రం రాలేదు. దాని స్థానంలో స్సైస్ బోర్డు తెచ్చామని అర్వింద్ తెలిపారు. అయితే లోక్‌సభ ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్‌ఎస్ మళ్లీ పసుపు పంచాయితీని తెరపైకి తెస్తోంది. బీజేపీపై కౌంటర్ ఎటాక్ మొదలు పెట్టింది.
ప్రపంచంలో 9 శాతం ఉత్పత్తి నిజామాబాద్‌లోనే..
పసుపు పంటకు కేరాఫ్ నిజామాబాద్. ప్రపంచం మొత్తం పండే పసుపులో 9 శాతం నిజామాబాద్ జిల్లాలోనే పండుతుంది. దీంతో ఆంధ్రాలో పొగాకు బోర్డు ఉన్నట్లు, తెలంగాణలోని నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పించాలని రైతలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. 2014 ఎన్నికల సమయంలో కవిత పసుపు బోర్డు సాధిస్తాననే నినాదంతో ఎంపీగా గెలిచింది. అయితే ఐదేళ్లు గడిచినా కేంద్రం సహకారం లేకపోవడంతో పసుపు బోర్డు ఏర్పాటు చేయలేదని తెలిపింది. కానీ రైతులు ఆ మాటను 2018లో నమ్మలేదు. దీంతో బీజేపీ అభ్యర్థి అర్వింద్‌ను గెలిపించారు.

ఇప్పుడు అదే అంశంపై బీఆర్‌ఎస్ కౌంటర్..
ఇప్పుడు ఇదే అంశాన్ని బీఆర్‌ఎస్ తనకు అనుకూలంగా మార్చే ప్రయత్నం ప్రారంభించింది. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా ఫెక్సీలు ఏర్పాటు చేయిస్తోంది. పసుపు బోర్డు వచ్చేసింది అని పెద్దపెద్ద హోర్డింగ్ల్ ఏర్పాటు చేస్తోంది. ఈమేరకు సోషల్ మీడియాలో కూడా రైతుల వేషధారణలో ప్రచారం చేస్తోంది.
స్పైస్ బోర్డు వచ్చాక పసుపు బోర్డు ఎందుకు..
అయితే ఎంపీ అర్వింగ్ మాత్రం స్పైస్ బోర్డు సాధించాక పసుపు బోర్డు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. స్పైస్ బోర్డు ద్వారా పసుపుకు గిట్టుబాట ధర కల్పిస్తున్నప్పుడు పసుపు బోర్డు ఎందుకని అర్వింద్ అంటున్నారు. బీఆర్‌ఎస్ కావాలనే రాద్దాంత చేస్తుందని ఆరోపిస్తున్నారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ కీలకమే..
2024 పార్లమెంట్ ఎన్నికల్లో మళ్లీ పసుపు బోర్డు అంశమే నిజామాబాద్‌లో కీలకం కాబోతోంది. హామీ ఇచ్చి సాధించలేదని బీఆర్‌ఎస్ ప్రచారం చేయాలని చూస్తోంది. అదే సమయంలో అర్వింద్ కూడా స్పైస్‌బోర్డు చూపి రైతులను ఓట్లు అడగాలని చూస్తున్నారు. ఈ క్రమంలో రైతులు ఎవరి మాట నమ్ముతారన్న చర్చ జరుగుతోంది. పసుపు అంశం ఎవరిని గెలిపిస్తుంది.. ఎవరిని ఓడిస్తుందో చూడాలి మరి!