Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu Naidu : పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా మారిపోయిన చంద్రబాబు..

Chandrababu Naidu : పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా మారిపోయిన చంద్రబాబు..

Chandrababu Naidu : తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో ఎన్నికలను ఎదుర్కోవడానికి పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించినప్పటి నుంచి ఆయన ఎంతో హుషారుగా కనపడుతున్నారు. ప్రతి ఒక్కరిని నవ్వుతూ పలకరించడమే కాదు.. అవకాశం దొరికినప్పుడల్లా వైసీపీపై, ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. పార్టీ కేడర్ లో జోష్ పెంచేందుకు పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ మాదిరిగా వ్యవహరిస్తున్నారు చంద్రబాబు నాయుడు. కేడర్ లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు.
ప్రజల్లో మార్పునకు సంకేతంగా భావిస్తున్న చంద్రబాబు..
ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో తెలుగుదేశం పార్టీ ఉత్సాహంగా ఉంది. ఈ విజయాన్ని ప్రజల్లో వచ్చిన మార్పుకు సంకేతంగా చంద్రబాబుతో పాటు తెలుగుదేశం పార్టీ భావిస్తోంది. ప్రజల్లో మార్పు వచ్చిందని, రానున్న ఎన్నికల్లో తనను, తన పార్టీని గెలిపించబోతున్నారని దృఢ విశ్వాసంతో చంద్రబాబు ఉన్నారు. అందుకే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా భయపడేది లేదని ఎదుర్కోవడానికి తమ సిద్ధంగానే ఉన్నామని ప్రకటిస్తున్నారు. ఎన్నికలు రేపు జరిగిన, ఎల్లుండి జరిగిన తమ గెలుస్తామనే భీమాను ఆయన వ్యక్తపరుస్తున్నారు. ఎప్పటికే చాలామంది వైసిపి ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని మీడియా సమావేశంలో నేరుగా చెబుతున్నారు. 175 స్థానాల్లో వైసీపీని ఓడించేందుకు ప్రయత్నిస్తున్నామంటూ చెబుతున్నారు. ఇదంతా ఎంఎల్సి ఎన్నికల్లో ఇచ్చిన ఉత్సాహంగానే భావిస్తున్నారు.
ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేస్తున్న వైసిపి..
రాష్ట్రంలోని ప్రతిపక్షాలను భయభ్రాంతులకు గురి చేయడమే వైసీపీ అజెండాగా మారిందని చంద్రబాబు విమర్శిస్తున్నారు. కానీ తమ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరు అధికార పార్టీకి భయపడనని చంద్రబాబు స్పష్టం చేశారు. ముందస్తు వచ్చిన సరే.. షెడ్యూల్ ప్రకారమే వచ్చినా సరే ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామంటూ చంద్రబాబు పార్టీ శ్రేణులు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్నారు. ఇప్పటికే తమ కార్యకర్తలు సర్వసన్నద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేస్తున్నారు. నాలుగేళ్లుగా అధికార పార్టీ వేధింపులను తట్టుకొని.. తరాన్ని చేదుక్కించుకునేందుకు కసితో తమ పార్టీ క్యాడర్ ఉందని చంద్రబాబు పేర్కొంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీకి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు జోస్యం చెబుతున్నారు.

టిడిపి ఇప్పటి వరకు గెలవని స్థానాలపై గురి..
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తర్వాత చంద్రబాబు వచ్చే ఎన్నికలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఒక్కసారి గెలవని స్థానాలను ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో టిడిపికి కొరుకుడు పడని నియోజకవర్గాలు జాబితాను సిద్ధం చేసిన చంద్రబాబు అక్కడ విజయం సాధించేందుకు అనుగుణంగా వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని ఓడించి తీరుతాం అంటున్న చంద్రబాబు నాయుడు.. కొరుకుడు పడని నియోజకవర్గాలను కైవసం చేసుకోవడానికి ఇదే మంచి తరుణంగా భావిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో విజయం సాధించడానికి ప్రత్యేక ప్రణాళికను చంద్రబాబు సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ఆ ప్రణాలిక విజయవంతం అయితే వచ్చే ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో టిడిపి జెండా ఎగరవేయడం ఖాయమన్న ధీమాను తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేస్తున్నారు.
పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ గా చంద్రబాబు..
పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్లు.. ఎప్పుడు ఉత్సాహాన్ని నింపే విధంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు కూడా అదే తరహాలోనే పార్టీ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల వరకు పార్టీ నాయకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచే ఉద్దేశంతో చంద్రబాబు కాస్త భిన్నంగా ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ వస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన విజయాలను ఎక్కడికక్కడ ప్రస్తావిస్తూనే.. మరోపక్క వైసీపీ పాలనపై ప్రజల్లో జరిగిన అసంతృప్తిని తెలియజేస్తున్నారు. నాలుగేళ్ల పాటు పోరాటం సాగించిన క్యాడర్.. మరో ఏడాది అదే స్ఫూర్తితో పని చేస్తే అధికారంలోకి రావడం ఖాయమని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు.
RELATED ARTICLES

Most Popular