https://oktelugu.com/

Hyderabad: ఈ టీచర్ దారుణం : హోంవర్క్ చేయలేదని విద్యార్థిని కొట్టి చంపింది..

గత నెల 30న హేమంత్ కుమార్ పాఠశాలకు వెళ్లాడు.అయితే హోంవర్క్ చేయలేదని టీచర్ మందలిస్తూ పలకతో కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు.

Written By:
  • Dharma
  • , Updated On : October 2, 2023 5:35 pm
    kindergarten student died after a teacher hit the child
    Follow us on

    Hyderabad: హైదరాబాద్ రామంతపూర్ లో ఘోరం చోటు చేసుకుంది. టీచర్ కొట్టడంతో ఓ విద్యార్థి మృతి చెందాడు. దీంతో కోపోద్రిక్తులైన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తంగా మారింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. రామంతపూర్ లోని ప్రైవేట్ స్కూల్లోహేమంత్ కుమార్ అనే విద్యార్థి యూకేజీ చదువుతున్నాడు. తరగతి గదిలో హేమంత్ కుమార్ అల్లరి చేయడంతో.. టీచర్ తలపైపలకతో కొట్టారు.దీంతో హేమంత్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు.కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతూ హేమంత్ మృతి చెందాడు.

    గత నెల 30న హేమంత్ కుమార్ పాఠశాలకు వెళ్లాడు.అయితే హోంవర్క్ చేయలేదని టీచర్ మందలిస్తూ పలకతో కొట్టడంతో అస్వస్థతకు గురయ్యాడు. వెనువెంటనే కుటుంబ సభ్యులు హేమంత్ ను ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటినుంచి చికిత్స పొందుతూనే ఉన్నాడు. ఆదివారం మృతి చెందాడు. అయితే పాఠశాల వర్గాలు మాత్రం అటువంటిదేమీ లేదని చెబుతున్నారు. మృతుడి తల్లిదండ్రులు మాత్రం టీచర్ పలకతో కొట్టడం వల్లే చనిపోయాడని ఆరోపిస్తున్నారు.

    సోమవారం రామంతపూర్ లోని ప్రైవేట్ పాఠశాల వద్ద మృతదేహంతో కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. హోం వర్క్ చేయకపోతే చనిపోయేలా కొట్టేస్తారా అంటూ ప్రశ్నించారు. దీనికి పాఠశాల యాజమాన్యమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆందోళన తీవ్రతరం కావడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు రంగ ప్రవేశం చేశారు.ఆందోళనకారులను సముదాయించారు.న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.దీంతో వారు శాంతించారు. ఆందోళనను విరమించారు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.