Chandrababu Media : చంద్రబాబు ఆరోగ్య విషయంలో వాస్తవం ఏంటి? ఆయన నిజంగా అనారోగ్యంతో బాధపడుతున్నారా? లేదా? ఇప్పుడు ఇది చర్చనీయాంశ అంశంగా మారిపోయింది. దీనికి తోడు ఎల్లో మీడియా రకరకాలుగా కథనాలు వండి వార్చుతోంది. దీంతో అసలు నిజం ఏదో తెలియక టిడిపి శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. అధినేతకు ఏమిటి ఈ పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎల్లో మీడియా పై సైతం టిడిపి శ్రేణులు ఒక స్థిరమైన నిర్ణయానికి వస్తున్నాయి.
ఏపీలో రాజకీయ పరిణామాలు తెలుసుకునేందుకు ప్రజలు మీడియాపై ఆధారపడడం లేదు. ఎందుకంటే అధికార పార్టీకి అధికార పత్రికగా సాక్షి ఉంది. తెలుగుదేశం పార్టీకి ఈనాడు, ఆంధ్రజ్యోతి మీడియా సంస్థలు ఉన్నాయి. దీంతో వాస్తవ వార్తను తెలుసుకునేందుకు ప్రజలు మూడు పత్రికలను ఆశ్రయించాల్సి వస్తోంది. ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ తదనంతర పరిణామాలు, ఆయన అనారోగ్య దుస్థితిపై వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా ఎల్లో మీడియా రాతలు ఎవరికీ అంతుపట్టడం లేదు. చంద్రబాబును అంతమొందించడానికి కుట్ర జరుగుతోందని.. ఆయన అనారోగ్యానికి గురైన వైద్య సేవలు అందించడం లేదని ప్రతిరోజు ఎల్లో మీడియాలో పతాక శీర్షికన కథనాలు వస్తున్నాయి. అయితే అందులో వాస్తవం ఎంత ఉందో తెలియడం లేదు.
సుమారు 50 రోజులుగా చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అక్కడ ప్రత్యేక వసతులు కల్పిస్తున్నా.. చంద్రబాబు కొన్ని రకాల అనారోగ్యాలకు గురయ్యారు. ఇదే విషయంపై జైలు అధికారులు చంద్రబాబు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఆయనకు కొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి ఉందని.. వైద్య సేవలు అందించాల్సి ఉందనితెలియజేశారు. కానీ ఆ వార్తను ఎక్కడా ఎల్లో మీడియా ప్రచురించలేదు. కనీసం చిన్న వార్తగానైనా వేయలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు ఆరోగ్యం విషయంలో గగ్గోలు పెడుతోంది.
సాధారణంగా జైలులో ఉండే ఖైదీలు అనారోగ్యానికి గురైనప్పుడు ప్రభుత్వ వైద్యులు వచ్చి నివేదిక అందిస్తారు. చంద్రబాబు కంటి వైద్యం విషయంలో సైతం వైద్య అధికారులు ఆపరేషన్ అవసరమని సిఫారసు చేశారు. అయితే ఎప్పటికీ ఇప్పుడు అవసరం లేదని సైతం సూచించారు. మావోయిస్టుల పేరిట వచ్చిన లేఖ సైతం ఫేక్ అని తేల్చారు. అయితే ఇదే విషయాన్ని ఎల్లో మీడియా భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నం చేసింది. ఇప్పటికి ఇప్పుడు కంటి ఆపరేషన్ అవసరం లేదని.. దానిపై జైలు అధికారులే ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన నివేదికలను మార్చారని.. మావోయిస్టుల పేరిట రాసిన లేఖ ఫేక్ అయితే రాసింది ఎవరని.. ఇలా పొంతన లేని అంశాలతో ఎల్లో మీడియా కథనాలు రాస్తుండడం విచారకరం. ఫలితంగా అవి చంద్రబాబు కి నష్టం చేస్తాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.