YCP- Gorantla Madhav Issue: వైసీపీ ఏదో వ్యూహం పన్నుతుందా? అరెస్ట్ లు, కేసుల నమోదు వంటి వాటికి పదును పెడుతోందా? ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైన ప్రతీసారి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ సర్కారు అనేక రకాలుగా ప్రయత్నాలు చేసింది. గత అనుభవాలు కూడా దీనిని తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం దేశవ్యాప్తంగా కుదిపేస్తోంది. సంచలనంగా మారింది. కానీ వైసీపీ సర్కారు ఈ విషయంలో స్పందించడం లేదు. అసలు ఏమీ జరగలేదన్న గుంభనంగా వ్యవహరిస్తోంది. అటు సీఎం జగన్ కూడా చాలా కూల్ గా కనిపిస్తున్నారు. అటు ఆరోపణలు ఎదుర్కొంటున్న గోరంట్ల మాధవ్ కూడా ఎంచక్కా హస్తినాలో వైసీపీ సహచరులతో చెట్టా పట్టాలు వేసుకుంటున్నారు. ఆయనపై చిలిపిచేష్టల ఆరోపణలు వచ్చినా గౌరవం మాత్రం తగ్గలేదు. ఇక్కడే అనుమానాలు పెరుగుతున్నాయి.
ఉన్నపలంగా అరెస్టులు..
గతంలో కూడా వైసీపీకి మరీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు టీడీపీ నేతలను టార్గెట్ చేసుకోని కేసులు నమోదు చేయడం, అవినీతి ఆరోపణలపై రాత్రికి రాత్రే అరెస్టులు చేయడం చేసేవారు. ఇప్పుడు కూడా అదే మాదిరిగా వ్యవహరిస్తారన్న టాక్ నడుస్తోంది. ఇప్పటికే గోరంట్ల మాధవ్ లాంటి బలహీనతలు ఉండే టీడీపీ నేతలను వెతికే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అదీ వీలుకాకపోతే అమరావతిలో ఇన్ ట్రేడింగ్ జరిగిందనో.. డేటా సమాచారం చోరీ జరిగిందనో.. కార్మికుల ఈఎస్ఐ సొమ్ము పక్కదారి పట్టించారనో కేసులు పెట్టేందుకు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ అరెస్టులు చేయని టీడీపీ నాయకులు ఎవరైనా ఉన్నారోనని ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మాధవ్ పై వచ్చిన ఆరోపణల అంశాన్ని డైవర్ట్ చేసేందుకు , పూర్తి మరుగున పడేసేందుకు పక్కా ప్లాన్ అమలవుతున్నట్టు అటు టీడీపీ నాయకులు కూడా అంచనా వేస్తున్నారు.
Also Read: CM Jagan: ఆ ఐదుగుర్ని అసెంబ్లీ గేటు తాకనివ్వనంటున్న సీఎం జగన్.. సాధ్యమేనా?
ప్రజలతో పనిలేదు...
ప్రజలు ఏమనుకుంటున్నారో వైసీపీ నేతలు అస్సలు ఆలోచించరు. తాము ఏది అనుకుంటే అదే చేసే అలవాటు వారిది. గతంలో మంత్రిగా ఉన్నప్పుడు అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యగా ఉన్నప్పడు అంబటి రాంబాబు జుగుప్సాకరమైన వ్యాఖ్యాలతో అడ్డంగా బుక్కయినప్పుడే పెద్దలు పట్టించుకోలేదు. చాలా లైట్ గా తీసుకున్నారు. డైవర్షన్ క్రియేట్ చేసి అంశాలను మరుగున పడేశారు. ఇప్పడు గోరంట్ల మాధవ్ విషయానికి వచ్చేసరికి సస్పెన్షన్ వేయనున్నట్టు తొలుత సొంత మీడియా ద్వారా లీకులిచ్చారు. మరో గంటల వ్యవధిలో వేటు అంటూ ప్రచారం మొదలు పెట్టారు. తీరా మీడియా ముందుకు వచ్చిన పార్టీ కీలక నేత సజ్జల రామక్రిష్ణారెడ్డి ఎంపీపై వచ్చిన ఆరోపణలు నిజమైతే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి ముగించేశారు. ఇప్పుడు రోజులు గడుస్తున్నా చర్యలులేవు. దీంతో వైసీపీ వ్యూహమేమిటన్నది ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశముంది.
Also Read:AP Politics: బంగారు అవకాశాన్ని చేజార్చుకుంటున్న జగన్