Nara Lokesh humility politics: ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలంటారు. పెద్దలపట్ల గౌరవభావంతో ఉండాలంటారు. ఈ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ), కేటీఆర్ ల కంటే లోకేష్ భిన్నం. తన తండ్రి సమకాలీకులతో జగన్మోహన్ రెడ్డి ఎలా ఉంటారో తెలియనిది కాదు. వారికి తన పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టే సంస్కారం కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు అన్న విమర్శ పొలిటికల్ వర్గాల్లో ఉంది. కేటీఆర్ సైతం తన తండ్రి కెసిఆర్ మాదిరిగా అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తారని కామెంట్స్ ఉన్నాయి.అయితే వినయ విధేయతలు సహజ సిద్ధంగా తమంతట తమకు రావాలి తప్ప ఎవరూ చెప్పరు. అయితే ప్రస్తుతం ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు లోకేష్. తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి సమయంలో ఆయన పార్టీలో సీనియర్లకు ఇస్తున్న గౌరవం అందర్నీ ఆకట్టుకుంటుంది.
చాలా హుందాగా..
ఇటీవల ఓ బహిరంగ సభలో మంత్రి రామానాయుడుని ఉద్దేశించి లోకేష్ ( Nara Lokesh) చేసిన వ్యాఖ్యలు సరదాగా అనిపించాయి. అన్నా నీతో నేను పోటీ పడలేను. నీతో పోటీ పడాలంటే ఇంకా ఎక్కువ కష్టపడాలి. అది నా వల్ల కాదు. కనుక ఆ నంబర్ ఏదో మీరే తీసుకోండి అంటూ సరదాగా వ్యాఖ్యానించారు లోకేష్. స్పీకర్ అయ్యన్నపాత్రుడు రాజకీయ అనుభవం అంత వయసు లేదు లోకేష్ కు. అట్లాంటి సీనియర్ పట్ల లోకేష్ నిన్న శాసనసభ కారిడార్ లో ప్రదర్శించిన వినయం అందర్నీ ఆకట్టుకుంది. స్పీకర్ అయ్యన్న కారు వద్దకు వెళ్తుంటే నారా లోకేష్ స్వయంగా కార్ డోర్ తీసి ఆయన కూర్చున్నాక మూసి సాగనంపారు.
సీనియర్లతో విందు..
మరోవైపు తెలుగుదేశం ( Telugu Desam)పార్టీ సీనియర్లతో విందు చేస్తూ.. వారి అనుభవాలను తెలుసుకుంటూ.. విలువైన సలహాలు స్వీకరిస్తూ.. వారి ఆశీర్వాదాలు తీసుకుంటున్నారు. శాసనసభ సమావేశాలు జరిగినన్ని రోజులు పార్టీ ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను పిలిచి సహపంతి భోజనాలు చేస్తున్నారు. వంగలపూడి అనిత వంటి మహిళలకు అయితే మంత్రి నారా లోకేష్ తోబుట్టువు మాదిరిగా వస్త్రాలు పెట్టారు. బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ నేతను తాతగారు అంటూ సంబోధిస్తూ చూపించే గౌరవభావం ఎవరినైనా ఆకట్టుకుంటుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే నేతల వారసులు వచ్చారు. వారి వ్యవహార శైలి, వారి మాట తీరు జనాలకు తెలిసిందే. సొంత పార్టీ నేతలు సైతం వారి చర్యలతో ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. కానీ లోకేష్ మాత్రం హుందా రాజకీయాలతో.. పెద్దలపట్ల వినయ విధేయతలతో ముందుకు సాగుతున్న తీరు మాత్రం ఆకట్టుకుంటోంది.
ఎవరూ ఊహించినది
అయితే లోకేష్ ఈ తరహా పరిణితి ఎవరు ఊహించలేదు. అంతెందుకు శాసనమండలిలో సీనియర్ నేత బొత్సతో నిత్యం సంవాదం చేసే మంత్రి లోకేష్.. ఎక్కడైనా బయట కనిపిస్తే ఆప్యాయంగా పలకరిస్తారు. సీనియారిటీతో పాటు ఆయన నిర్వర్తించిన పదవులకు గౌరవం ఇచ్చి మాట్లాడతారు. పార్టీలో సీనియర్ల పట్ల జగన్ తో పాటు కేటీఆర్ వ్యవహరించే తీరు ఎన్నో విమర్శలకు కారణం అయ్యింది. కానీ నారా లోకేష్ తన ఇంటి తలుపులు తెరిచి ఈ విధంగా పార్టీలో అందరినీ ఆహ్వానిస్తున్నారు. వారితో ఆత్మీయంగా మెలుగుతున్నారు. రాజకీయాల్లో రాణించాలనుకునే వారికి ప్రథమ లక్షణంగా ఈ వినయ విధేయతలు అన్నవి ఉండాలి. లోకేష్ లో అవి పుష్కలం కూడా.
ఏపీలో ఆసక్తి రేపుతున్న మంత్రి నారా లోకేష్ కొత్త ఆలోచన
టీడీపీ నేతల్ని ఇంటికి పిలిచి గౌరవించే సరికొత్త సాంప్రదాయానికి శ్రీకారం చుట్టిన లోకేష్
తొలిరోజు బందరు లోక్సభ సెగ్మెంట్ నేతల ఫ్యామిలీతో లోకేష్ డిన్నర్
కుటుంబ శుభకార్యంలా జరిగిన కార్యక్రమం
ఇకపై ప్రతిరోజూ ” ఫ్యామిలీ… pic.twitter.com/Jtg49hYtUH
— BIG TV Breaking News (@bigtvtelugu) February 14, 2026