NITI Aayog- KCR: నీతి ఆయోగ్ విషయంలో సీఎం కేసీఆర్ చెప్పేవన్ని అబద్ధాలని సంస్థ ప్రకటించింది. సీఎం కేసీఆర్ దురుద్దేశ పూర్వకంగా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు కేటాయిస్తున్నా తమకు రావడం లేదని చెబుతూ వక్రీకరించడం సమంజసం కాదని చెబుతోంది. కేసీఆర్ నీతి ఆయోగ్ సమావేశానికి హాజరు కావడం లేదని చెప్పడం సరైంది కాదని తప్పుబట్టింది. అజెండా రూపకల్పనలో రాష్ట్రాలకు సమ ప్రాధాన్యం ఇవ్వలేదని ఆరోపణలు చేయడం అర్థరహితమని అభివర్ణించింది.
అజెండా తయారీలో రాష్ట్రాలను సంప్రదించడం లేదని లేని పోని నిరాధారంగా మాట్లాడటం సరైంది కాదని చెబుతోంది. నీతి ఆయోగ్ పనితీరులో ఎలాంటి స్వార్థ ప్రయోజనాలు ఉండవని వివరణ ఇచ్చింది. సీఎం కేసీఆర్ దురుద్దేశ పూర్వకంగానే వ్యవహరిస్తున్నారని నీతి ఆయోగ్ ప్రకటించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా సంస్థపై నిందలు వేస్తూ తప్పుదారి పట్టిస్తున్నారు. దీంతో కేసీఆర్ మాటలు అర్థరహితమని పేర్కొంది. కేంద్రం అన్ని రాష్ట్రాలకు సమానంగా నిధులు పంపిణీ చేస్తోంది. అందులో భాగంగానే తెలంగాణకు కూడా నిధులు ఇచ్చింది.
తెలంగాణకు 2015-16లో దాదాపు రూ.2 లక్షల కోట్లు, 2022-23 సంవత్సరానికి రూ. 4 లక్షల కోట్లకు పెరిగింది. నిధులు తీసుకుంటూనే మాకు సంబంధం లేదని బుకాయించడం సమంజసం కాదని తెలుస్తోంది. ఓ వైపు నిధులు తీసుకుంటూనే మరోవైపు మాకు ఇవ్వడం లేదని పేచీలు పెట్టడం విడ్డూరంగా ఉంది. ఇంకా జల్ జీవన్ మిషన్ కింద తెలంగాణకు రూ.3,982 కోట్లు కేటాయిస్తే ప్రభుత్వం రూ.200 కోట్లు మాత్రమే తీసుకుంది. పీఎంకేఎస్ వై, ఏబీపీ స్కీం కింద రూ. 1,195 కోట్లు కేటాయించినట్లు తెలుస్తోంది.
ఊరికే మాట్లాడం కాదు ఇన్ని నిధులు విడుదల చేస్తే మాకు ఇవ్వడం లేదని బుకాయించడంలో ఆంతర్యమేమిటో తెలియడం లేదు. కావాలనే ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సైతం వస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో నిధులు చెల్లిస్తుంటే మాకు అందడం లేదని చెప్పడం నిజంగా అసత్య ఆరోపణలే అని తెలుస్తోంది. దీనిపై సీఎం కేసీఆర్ ఏం చెబుతారో తెలియడం లేదు. కానీ ఏదో కావాలని చేస్తూ ఇలా నిందలు వేయడం మాత్రం కరెక్టు కాదని అందరు సూచించడం గమనార్హం. నీతి ఆయోగ్ పై సీఎం కేసీఆర్ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నారు.
Also Read:AP Capital Issue: రాజధానులపై వైసీపీ కొత్త డ్రామా… రాజ్యసభలో ప్రైవేటు బిల్లు..