YCP Vs TDP: చంద్రబాబు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో గొడవ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటిని ముట్టడించి ఆయనకు […]

Written By: Srinivas, Updated On : September 17, 2021 6:06 pm
Follow us on

YCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది. ఇరు పార్టీలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్దం పెరుగుతోంది. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్, టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మధ్య తోపులాట చోటుచేసుకోవడంతో గొడవ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కోడెల శివప్రసాద్ సంస్మరణ సభలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంటిని ముట్టడించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

దీంతో పోలీసులు రంగంలోకి దిగినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలను అదుపు చేయడానికి లాఠీచార్జి చేశారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. దీంతో చంద్రబాబు నివాసానికి టీడీపీ నాయకులు చేరుకున్నారు. ఈక్రమంలో జరిగిన గొడవలో బుద్ద వెంకన్న సొమ్మసిల్లి పడిపోయారు. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. దీంతో రెండు వర్గాలు రెచ్చిపోయాయి.

గొడవలో ఎమ్మెల్యే జోగి రమేశ్ కారు అద్దం ధ్వంసం అయింది. వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుపై దాడి చేసేందుకే ఇలా ప్రవర్తించారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నా చర్యలు మాత్రం తీసుకోవడం లేదని ధ్వజమెత్తుతున్నారు. టీడీపీ నేతలకు గాయాలైనా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నేతలు గుండాల్లా వ్యవహరించారని దుయ్యబట్టారు.

టీడీపీ చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నిర్వాకంపై ఎమ్మెల్యే రమేశ్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు కావాలనే తనపై ఇలా చేయించారని విమర్శించారు. చంద్రబాబు క్షమాపణ చెప్పకుంటే ఊరుకోబోమని చెప్పారు. అసలు రాష్ర్టంలో ప్రతిపక్ష నేతల తీరు దారుణంగా ఉందని పేర్కొన్నారు.