Amith Shah: విమోచన సభలో కేసీఆర్, మజ్లిస్ ను చీల్చిచెండాడిన అమిత్ షా

Amith Shah: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, మజ్లిస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడానికి కారణం మజ్లిస్ పార్టీ అని.. మజ్లిస్ కు కేసీఆర్ భయపడుతాడు కానీ బీజేపీ భయపడదు అని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణలో అధికారికంగా జరుపుతామని అమిత్ షా […]

Written By: NARESH, Updated On : September 17, 2021 5:21 pm
Follow us on

Amith Shah: తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేంద్రహోంమంత్రి అమిత్ షా నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్, మజ్లిస్ పార్టీలపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవం జరపకపోవడానికి కారణం మజ్లిస్ పార్టీ అని.. మజ్లిస్ కు కేసీఆర్ భయపడుతాడు కానీ బీజేపీ భయపడదు అని అమిత్ షా స్పష్టం చేశారు. అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవాన్ని తెలంగాణలో అధికారికంగా జరుపుతామని అమిత్ షా స్పష్టం చేశారు.

కర్ణాటకలో హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని ఘనంగా జరుపుతున్నామని.. తెలంగాణలో కేసీఆర్ హామీలు ఇచ్చి మరీ ఎందుకు జరపడం లేదని అమిత్ షా ప్రశ్నించారు. తెలంగాణ విమోచన వీరుల బలిదానాలు కేసీఆర్ కు పట్టవా? అని నిలదీశారు.

సర్ధార్ వల్లభాయ్ పటేల్ పరాక్రమం వల్లే హైదరాబాద్ విమోచనం సాధ్యమైందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 13 నెలల తర్వాత తెలంగాణకు స్వేచ్ఛ లభించిందన్నారు.

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో లోక్ సభ సీట్లన్నీ గెలుస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ అంతిమ దశకు చేరుకుందన్నారు. మజ్లిస్ ను ఓడిస్తేనే తెలంగాణకు అసలైన స్వేచ్ఛ అని స్పష్టం చేశారు. బీజేపీ మాత్రమే మజ్లిస్ పై పోరాడుతుందన్నారు. మన నినాదాలు హైదరాబాద్ వరకూ వినిపించాలని కోరారు.

ఇక కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సైతం మాట్లాడారు. తెలంగాణలో విమోచన దినోత్సవాలు జరపని కేసీఆర్ సర్కార్ ను నిలదీశారు. తెలంగాణ ప్రజలు సచివాలయానికి వచ్చే సీఎం కావాలని కోరుకుంటున్నారని..నియంత పాలన పోవాలని కోరుకుంటున్నారని కిషన్ రెడ్డి విమర్శించారు.

-కేసీఆర్ క్షమాపణ చెప్పాలన్న బండి సంజయ్
ఇక తెలంగాణలో విమోచన దినోత్సవం జరపని కేసీఆర్ క్షమాపణలు చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. తెలంగాణ విమోచన వీరులు పైనుంచి చూస్తున్నారని.. ప్రగతి భవన్ లో బీజేపీ జెండా ఎగురుతుందన్నారు. సర్ధార్ పటేల్ లేకుంటే తెలంగాణ పాకిస్తాన్ లో కలిసి ఉండేదన్నారు. పటేల్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదన్నారు.