Homeఎంటర్టైన్మెంట్Tollywood Stories: హిందీలో తెలుగు సినిమాల ఆదరణకు కారణమదే !

Tollywood Stories: హిందీలో తెలుగు సినిమాల ఆదరణకు కారణమదే !

Tollywood StoriesTollywood Stories: తెలుగు సినిమా కథలకు గత కొంత కాలంగా బాలీవుడ్ లో బాగా డిమాండ్ పెరిగిందని అక్కడ మీడియా బాగా కవర్ చేస్తోంది. మరి నిజంగానే ఉత్తరాదిన తెలుగు భాషకు, తెలుగు సినిమాలకు ప్రాచుర్యం ఎక్కువ అయిందా అంటే.. అయిందనే చెప్పాలి. నిజానికి తెలుగు కథలకు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఆదరణ ఉంది. నాగార్జున మాస్ సినిమాని “మేరీ జంగ్ – వన్ మెన్ ఆర్మీ” పేరుతో, అలాగే చిరంజీవి ఇంద్ర సినిమాని “ఇంద్ర – ది టైగర్” పేరుతో హిందీలో డబ్ చేసి టీవీల్లో వేస్తే విపరీతంగా ఆదరించారు.

అలాగే ఇప్పుడు కూడా కొన్ని తెలుగు సినిమాలను బాగా ఆదరిస్తున్నారు. కాకపోతే, దాన్ని తెలుగు సినిమాల గొప్పతనం అనేకంటే.. ఈ మధ్య హిందీ చిత్రాల్లో పస తగ్గింది ఆనడం కరెక్ట్. అందుకు, చాలా కారణాలు ఉన్నాయి. 1995 తర్వాత బాలీవుడ్ కధలు ఎక్కువగా విదేశాల నేపథ్యం, అలాగే సిటీ నేపథ్యంలో జరిగేలా తీశారు.

మొదట్లో అవి కొత్తగా అనిపించినా… పోను పోను రొటీన్ అయ్యి సగటు ప్రేక్షకుడికి సంబంధం లేని కథలుగా తయారయ్యాయి. దీనికితోడు చాలా వరకు బాలీవుడ్ సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో హాలీవుడ్ ని కాపీ చేయడం అలవాటు అయిపోయింది. దాంతో కుటుంబం మొత్తం కూర్చుని ఒక హిందీ సినిమాని చూడలేని పరిస్థితి కల్పించారు బాలీవుడ్ మేకర్స్.

అన్నిటికి మించి తెలుగు సినిమాలకు హిందీ డబ్బింగ్ మార్కెట్ ఊపు అందుకుంది ఇప్పుడు పెద్ద సినిమాల డబ్బింగ్ హక్కులు 10 కోట్ల పైనే వుంది. ముఖ్యంగా సోనీ మాక్స్ అండ్ స్టార్ గోల్డ్ ఈ మార్కెట్ లో చాలా సంపాదిస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, బీహార్, గుజరాత్, ఒడిస్సా, రాజస్థాన్ లాంటి చోట్ల తెలుగు డబ్బింగ్ సినిమాలు బాగా ఫేమస్ అయ్యాయి కూడా.

అయితే ‘బాహుబలి’తో తెలుగు సినిమా సత్తా దేశ వ్యాప్తంగా పెరగడం కారణంగానే తెలుగు సినిమాల డబ్బింగ్ మార్కెట్ ఎదుగుదలకు బాగా హెల్ప్ అయింది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version